Katrina Kaif.. అదేనండి మన మల్లీశ్వరి. బాలీవుడ్లో సూపర్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్లలో కత్రినా ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఒకప్పుడు మెరిసింది. వెంకటేశ్‌తో కలిసి మల్లీశ్వరిలో యువరాణిగా అలరించింది. బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే మూవీలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇక టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. బాలీవుడ్లోనే పాగా వేసి ఇప్పుడు అక్కడ హై రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్గా స్థిరపడింది.
కత్రినాను బీ టౌన్ ముద్దుగా క్యాట్ అని పిలుచుకుంటుంది. ముంబయిలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాయికల్లో కత్రినా నంబర్ వన్. తన గ్లామర్, నటనతో మెప్పిస్తూ ఈ అమ్మడు ఇప్పటికీ తన ఫామ్ సాగిస్తోంది. ఇటీవలే ఫోన్ బూత్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది కత్రినా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కే బ్యూటీ బై కత్రినా అంటూ వ్యాపారం మొదలుపెట్టింది. అంతేకాకుండా కత్రినా సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హవా మామూలుగా లేదు. మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ ఫొటోషూట్లకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఎంత స్టైలిష్ డ్రెస్‌లు వేసినా.. ఈ బ్యూటీ వల్గర్‌గా అసలు కనిపించదు. ప్రతి ఔట్ఫిట్ కత్రినా కోసమే డిజైన్ చేసినట్టు సూపర్‌గా నప్పుతుంది ఈ భామకు.
రీసెంట్గా ఫెమినా కోసం మరోసారి తన హాట్ అండ్ క్రేజీ పోజులతో ఫొటోషూట్ చేసింది కత్రినా. బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడు పదులు దాటినా ఈ బ్యూటీ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గ్లామర్ ట్రీట్‌తో ఈ బ్యూటీ ఇప్పటికీ కుర్రాళ్ల ఫేవరెట్‌గా నిలిచిపోయింది. విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన ఈ భామ హాట్‌నెస్‌లో తనకు ఎవరూ సాటి రారంటూ బ్యూటీ ట్రీట్ ఇస్తోంది.
సినిమాల సంగతి ఎలా ఉన్నా ఫ్యాషన్ మేగజైన్స్ కోసం హీరోయిన్ల ఫొటోషూట్స్ తీసుకొచ్చే మైలేజ్ది వేరే లెక్క. ఈ లిస్టులో కత్రినా తర్వాతే ఎవరైనా. తన ప్రతి ఫొటోషూట్‌లో ఈ బ్యూటీ తన గ్లామర్ డోస్‌ను చూపిస్తుంది. హాట్నెస్ ఓవర్ లోడ్ అనేలా పోజులిచ్చినా.. ఎక్కడా వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడుతుంది కత్రినా. ఈ బ్యూటీ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.