బాలీవుడ్ స్టార్ హీరోయిన్ Katrina Kaif , యంగ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విక్కీ తనకంటే చిన్నవాడు. అప్పట్లో వీరి వివాహం బాలీవుడ్ లో హాట్ టాపిక్. కేవలం బంధువులు, స్నేహితుల మధ్య వీరి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. విక్కీ-కత్రినాల ప్రేమ వ్యవహారం నుంచి పెళ్లి వరకు బీ టౌన్ లో పెద్ద చర్చే నడిచింది. ఎట్టకేలకు ఇద్దరూ ఒక్కటై తమ మ్యారీడ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు యాడ్స్.. ఇంకోవైపు వ్యాపారంతో కత్రినా ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. విక్కీ కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇద్దరూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నా.. తమకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుని తరచూ కలిసి టైం స్పెండ్ చేయడం లేదా వెకేషన్స్ కి వెళ్తుంటారు. అలా అప్పుడప్పుడు తాము కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తారు.
పెళ్లి తర్వాత బిజీగా ఉంటూ..భర్తతో తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కత్రినా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్యాట్.. వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్న సమయంలో తను పెళ్లికి ఒప్పుకోవాలంటే కొన్ని కండీషన్లు పెట్టిందట. ఆ కండిషన్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి కొందరు నివ్వెరపోతున్నారు. ఇదేం మాయ రోగం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
క్రేజీ కండిషన్ పెట్టి విక్కీ కౌశల్ కు షాక్ ఇచ్చిందట కత్రినా. పెళ్లికి ముందు ఎలా ఉందో.. పెళ్లి తర్వాత కూడా ఎవరి సంపాదన వారిదేనన్న కండిషన్ పెట్టిందట కత్రినా. సాధారణంగా భార్యాభర్తలంటే కష్టసుఖాలు, సంపాదనలలో కూడా భాగస్వామ్యం పంచుకుంటారు కదా.. కానీ కత్రినా మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లు ఎవరి సంపాదన వారిదేనంటోందట.
“నీకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది.. ఎందుకు డబ్బులు వాడుతున్నావు అని నేను అడగను ..నువ్వు కూడా నా రెమ్యూనరేషన్ తో పాటు నా ఆస్తుల జోలికి రావద్దు” అని విక్కీ దగ్గర కత్రినా పెళ్లికి ముందే మాట తీసుకుందట. అంతే కాదు “ఏదైనా స్థిరాస్తులు కొనాలన్నా.. ఇద్దరు సమాన షేర్ లో కొని.. సమానంగా పంచుకోవాలి అని కండిషన్ పెట్టిందట. అంతే కాదు.. నేను ఖర్చు చేస్తున్నందుకు నువ్వు అరవకూడదు..నా మీద పెత్తనం చెలాయించకూడదు ..నా డబ్బులు ఏమైనా చేసుకుంటాను” అని ముఖం మీదే చెప్పేసిందట.
“నా ఖర్చులు నావి.. నా టూర్లకు అట్టు చెప్పొద్దు.. నేను మేకప్ కిట్స్ కొనుక్కుంటాను.. ఏమైనా చేసుకుంటాను. నువ్వు మాత్రం అడగొద్దు. అంతే కాదు నువ్వు ఏం చేసినా నేను అడగను.. నువ్వు తాగినా.. ఫ్రెండ్స్ కి ఖర్చు చేసినా అడగను.. ఏదైనా సరే ఫ్యామిలీకి పెట్టాలి అనుకున్న టైంలో ఇద్దరం షేర్ చేసుకొని పెట్టుకుందాం”.. అంటూ ఇంకా చాలా కండిషన్స్ అప్లై చేసి మరీ పెళ్ళాడిందట.
బీ టౌన్ లో ఇటీవల బ్రేకప్, విడాకులు ఎక్కువవుతున్న నేపథ్యంలో భవిష్యత్ మన చేతుల్లో ఉండదన్న భావనలో కత్రినా విక్కీ ముందు ఈ కండిషన్లు పెట్టి ఉంటుందని కొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కత్రినా నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా అంటూ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదుగా.. విక్కీకి లేని సమస్య మనకెందుకంటూ ఇంకొందరు నెటిజన్లు వాళ్లిద్దరి అభిప్రాయాలను సపోర్ట్ చేస్తున్నారు.