డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని చేసిన హీరోయిన్..!ఇటీవల కాలంలో కొంతమంది డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి చాలామంది ఉదాహరణగా నిలుస్తున్నారు. ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలనే ఆలోచనలో తప్పుడుదారుల్లో వెళుతూ మరింతగా నీచ స్థానానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మాత్రం డబ్బు విషయంలో కొంతమంది చాలా దిగజారిపోతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే చాలు వాళ్ళ వయస్సు, వాళ్ల వివరాలు ఏమీ తెలుసుకోకుండానే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు దొరికినా సరే వీళ్లను వదిలేసి వాళ్లను పెళ్లి చేసుకుంటూ ఉండడంతో ఇండస్ట్రీలో నానా చెత్త రోజుకొక వార్త రూపంలో వైరల్ అవుతోంది.

అంతేకాదు డబ్బు కోసమే ఇలా చేస్తున్నామని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ డబ్బు కోసం కక్కుర్తి పడి ఏకంగా ముసలోడినే వివాహం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ గతంలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని..రెండు సంవత్సరాలకే విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఇంకొక హీరోతో చట్టపట్టలేసుకొని తిరిగి డేటింగ్ కూడా చేసింది. కానీ ఆ హీరోకి పెద్దగా ఇండస్ట్రీలో గుర్తింపు లేకపోవడంతో అతడిని దూరం పెట్టింది. ఇప్పుడు ఆమెకు బాగా డబ్బున్న ముసలి నిర్మాత కనిపించడంతో వయసుతో సంబంధం లేకుండా అతడిని వివాహం చేసుకుంది. అయితే అతడి వయసు 50 సంవత్సరాలు. అప్పటికే ఆ నిర్మాతకు పెళ్లయి.. పిల్లలు కూడా ఉండగా.. అతడి పై మోజు పెంచుకొని ముసలివాడిని వివాహం చేసుకుంది.

అయితే నిర్మాత దగ్గర కోట్ల ఆస్తి ఉందని తెలుసుకున్న హీరోయిన్ ఇలా చేసిందని తెలుస్తోంది. కానీ ఆ నిర్మాత ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇంకా సస్పెన్స్ వీడ లేదు.