Karthika : ఘనంగా ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి.. చిరు సహా హాజరైన సెలబ్రెటీలు..!

- Advertisement -

Karthika : అలనాటి స్టార్ హీరోయిన్ రాథ కుమార్తె.. కార్తీక పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సహా.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నాగచైతన్య ఫస్ట్ మూవీ జోష్ లో హీరోయిన్ గా నటించింది కార్తీక. ఇది నాగచైతన్య, కార్తీక డెబ్యూ మూవీ. స్టార్ హీరోయిన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. కార్తీకకు పెద్దగా ఛాన్సెస్ రాలేదు. చాలా వరకు ఫ్లాప్స్ ఉన్నాయి. దీంతో మూవీస్ మానేసి ప్రస్తుతం దుబాయ్ లోని తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటుంది ఈ బ్యూటీ.

Karthika
Karthika


ఇక రీసెంట్ గానే పెళ్లికి సంబంధించిన హింట్ ఇచ్చిన బ్యూటీ.. రింగ్ ఉన్న ఫొటో షేర్ చేసి ఎంగేజ్ మెంట్ విషయాన్ని అనౌన్స్ చేసింది. తాను ప్రేమించిన రోహిత్ మీనన్ ను మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ పెళ్లికి అప్పటి తారలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. చిరంజీవి, సుహాసిని, రాథిక, రేవతి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి స్టార్స్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తమిళంలోను చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది కార్తీక. రంగంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దమ్ము మూవీలో నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here