‘
Japan Trailer Review : తమిళ హీరో కార్తీకి ‘జపాన్’ 25వ సినిమా. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జపాన్’ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ని బట్టి చెప్పొచ్చు. ‘కుకూ’, ‘జోకర్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మించారు.

ట్రైలర్ విషయానికి వస్తే… చిన్న వయసులో తల్లి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసే జపాన్ పేరున్న యువకుడి పాత్రలో కార్తీ కనిపించనున్నాడు. హైదరాబాద్‌లోని మంత్రి ఇంట్లో రూ.200 కోట్లు దోచుకుని.. హత్య చేశాడని అతడిపై నిందలు మోపుతారు. బడా నేత కావడంతో దీంతో జపాన్ ను ఎన్ కౌంటర్ చేసేందుకు పోలీసులు గాలిస్తుంటారు. వీరి నుంచి జపాన్ ఎలా బయటపడిందన్నదే ట్రైలర్‌లో కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఫన్నీ డైలాగ్‌లు ఫుల్ గా ఉన్నాయి. ‘సింహం కాస్త సిక్ అయితే, పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టాయంట.’, ‘మీరు చెప్పిన కథలో ఆ తిమింగలాన్ని పట్టేసుకున్నారా’ అని అడిగినప్పుడు కార్తీ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌లో ‘ఓ… సి సెంటర్ దాకా రీచ్ అయిందా?’ అని అడగటం బాగా ఫన్నీగా అనిపిస్తుంది.
‘జపాన్’ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సొంతం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘జపాన్’ తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. కార్తీ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయడంతో ‘జపాన్’ తెలుగులో కూడా భారీగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఇతర భాషల్లోని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా అందిస్తుంటాయి.
కానీ, కార్తీ ‘జపాన్’ తెలుగు హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకోవడానికి ఓ రీజన్ ఉంది. కార్తీతో నాగార్జునకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘ఊపిరి’ సినిమా కూడా వచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. కార్తీ నటించిన ప్రతి సినిమాకి నాగార్జున బెస్ట్ విషెస్ చెప్తుంటారు. కార్తీ నటించిన ‘సర్దార్’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ క్రమంలో కార్తీ నటించిన ‘జపాన్’ సినిమా తెలుగు హక్కులను నాగార్జున భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.