Akshara Haasan : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. ఎవరిని ఎవరు ప్రేమిస్తారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు.. ఎన్నాళ్లు కలిసి ఉంటారన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత వాళ్లు ఎందుకు విడాకులు ఇస్తారో కూడా తెలియకుండా పోతుంది. పెళ్లికి ముందు చాలామంది ప్రేమాయణాలు నడిపి ఇండస్ట్రీలో పాపులార్ అయిపోతుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ప్రేమించుకొని చెటపట్టాలేసుకొని కొన్నాళ్లు తిరిగి బోర్ కొట్టి నచ్చలేదన్న కారణంతో విడిపోవడం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. తాజాగా కమలహాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా ఒక హీరోతో ప్రేమాయణం నడిపి పెళ్లికి రెడీ అయిందట.
ఆ హీరో ఎవరో కాదు తనూజ్ విర్వని. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి కుమారుడే ఇతడు. తను 2013లో కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఓటీటీ పుణ్యమా అంటూ ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పలు రకాల వెబ్ సిరీసుల్లో నటించారు. కెరియర్ స్టార్టింగ్ లోనే తనూజ్ అక్షర హాసన్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రేమ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతుందని రూమర్స్ కూడా వినిపించాయి. అంతలోనే విభేదాలు వలన వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తనూజ్ మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిని కాదని తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు.