Kamal Haasan : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి ఎక్కడ చూసిన సూపర్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే చివరి 30 నిమిషాలు మరో ఎత్తు అంటూ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్ పాత్రకి క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎలివేషన్‌కి ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ వచ్చాయి. అయితే సినిమాలో రెండు మూడు సీన్లకే పరిమితమైనప్పటికీ విశ్వనటుడు కమల్ హాసన్ క్లైమాక్స్‌లో చెప్పిన ఒక డైలాగ్ మాత్రం ఆడియన్స్ పిచ్చెక్కించింది. మరి ఆ డైలాగ్ ఏంటి? దీనికి కమల్ హాసన్‌కి లింకేంటో చూద్దాం.

కల్కి చిత్రంలో సుప్రీం యాస్కిన్ అనే పాత్రలో నటించారు కమల్ హాసన్. సినిమా మొత్తంలో కేవలం రెండు మూడు సార్లే కమల్ కనిపించారు. మొదట చూసినప్పుడు అసలు ఈ మాత్రం దానికి కమల్ లాంటి దిగ్గజ నటుడ్ని ఎందుకు తీసుకున్నారా అని ఆనయ ఫ్యా్న్స్ హర్ట్ అయ్యారు. కానీ క్లైమాక్స్‌లో ఒక్క డైలాగ్‌తో వారందరితో విజిల్స్ వేయించారు కమల్. “జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్..రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను! భూకంపం పుట్టిస్తాను.” అంటూ కమల్ చెప్పిన ఈ డైలాగ్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ డైలాగ్‌తోనే సినిమా ముగిసింది. వెంటనే ‘కల్కి 2898 ఏడీ’ సినిమాటిక్ యూనివర్స్ కొనసాగుతుంది అంటూ టైటిల్ కార్డ్స్ పడ్డాయి. దీంతో తరువాయి భాగంలో కమల్ హాసన్ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో ఆడియన్స్‌కి హింట్ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే కమల్ చెప్పిన ఇదే డైలాగ్‌ను ఆయన 44 ఏళ్ల క్రితమే మరో చిత్రంలో కూడా చెప్పారు.
గ్రేట్ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన ‘ఆకలి రాజ్యం’ అనే సినిమాలో కమల్ హాసన్ మహాకవి శ్రీశ్రీ అభిమానిగా నటించారు. కడుపుకాలినా, గుండెమండినా, ఏడుపొచ్చినా, ఆనందమొచ్చినా శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితలు చెబుతూ ఉంటారు కమల్. అలా సినిమాలో ఓ సందర్భంలో “పతితులార! భ్రష్టులార.. బాధాసర్ప దష్టులార! దగాపడిన తమ్ములార! ఏడవకండి ఏడవకండి.. జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్..రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను! భూకంపం పుట్టిస్తాను.” అంటూ కమల్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ డైలాగ్‌ను కమల్ నోటి వెంట వినడం అభిమానులకి గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ డైలాగ్‌లోని డెప్త్ కమల్ వాయిస్‌లోని బేస్‌తో థియేటర్లో వింటుంటే అబ్బబ్బా.. అది మాటల్లో చెప్పే ఫీలింగ్ కాదబ్బా! ఆ కిక్కే వేరు!!