Kamal Haasan : కోట్లాది మంది ప్రేక్షకులు వీకిస్తున్న ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసిన హోస్ట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ ప్రస్తుతం అదే ఎదురుకుంటున్నాడు. చాలా కాలం నుండి ఆయన తమిళం లో బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం నడుస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ కి కూడా ఆయనే హోస్ట్. అయితే ఇన్ని సీజన్స్ లో కమల్ హాసన్ పై రాని వ్యతిరేకత, బిగ్ బాస్ సీజన్ 7 తో రప్పించుకున్నాడు. నిజాయితీగా ఆడుతూ టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్న ప్రదీప్ అనే వ్యక్తిని, రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేయడం కమల్ హాసన్ తెలివి తక్కువ నిర్ణయానికి ప్రతీక అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ప్రదీప్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో హీట్ వాదనలు జరుగుతున్న సమయం లో ఒక అమ్మాయి పై బూతులు వదులుతాడు. అది మన తెలుగు బిగ్ బాస్ లో ఎన్నిసార్లు ఈ సీజన్ లో అలాంటి పొరపాట్లు జరిగాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. దానికి వార్నింగ్ ఇచ్చి మరోసారి రిపీట్ కాకుండా ఉండే చూసుకోమని నాగార్జున పలు సార్లు చెప్పాడు. కానీ కమల్ హాసన్ అది చెయ్యలేదు, నేరుగా ప్రదీప్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేశారు.
ఇది తమిళ ఆడియన్స్ లో కమల్ హాసన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. ఎందుకంటే ప్రదీప్ గొప్ప ఆటగాడు, ప్రస్తుతం ఓటింగ్ లో బిగ్ బాస్ హౌస్ లోనే అందరికంటే ఎక్కువ శాతం దక్కించుకుంటున్న కంటెస్టెంట్. అలాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చెయ్యడం బాధాకరం అని నెటిజెన్స్ అభిప్రాయం. ఈ వారం ప్రదీప్ ని మళ్ళీ హౌస్ లోకి పంపించి చేసిన తప్పు సరిదిద్దుకుంటారా అనుకుంటే అది జరగలేదు. కమల్ హాసన్ పై ఏర్పడిన ఈ వ్యతిరేకత, రాజకీయం గా కూడా ఆయన్ని కృంగదీస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు .