Kamal Haasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కెరీర్ కతం అయ్యింది. పొలిటికల్ పార్టీ పెట్టారు కదా.. ప్రజాసేవకే అంకితం అని అందరూ భావించారు. ఇదే టైంలో విక్రమ్ సినిమా వచ్చింది. కమల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ ని పాతికేళ్లు వెనక్కి తీసుకు వెళ్లినట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను కమల్ డైరీలో ఉన్నాయి.
ఒకప్పుడు కమల్ ఎంత బిజీగా వరుసగా సినిమాలు చేసేవాడో ఇప్పుడు కూడా అలాగే వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ఏడు పదుల వయసు లో కమల్ హాసన్ జోరు చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు. సాధారంగా 70 ఏళ్లు వచ్చాయంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూంటాయి. కానీ కమల్ మాత్రం వందల కోట్ల బడ్జెట్ సినిమాలు వరుస పెట్టి చేస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2, ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న కమల్.. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ ను ప్రకటించాడు. మరో వైపు ఇండియన్ 3 సినిమా ఉంటుందని చెప్పిన కమల్ హాసన్ విక్రమ్ సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వచ్చే ఏడాది వేసవిలో ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కమల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ మూవీ కూడా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. 2025 లో మణిరత్నం థగ్స్ లైఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా కమల్ సినిమాల జాతర కొనసాగబోతుంది.
మరోవైపు కమల్ నటిస్తున్న మూవీలతో పాటు.. బయట హీరోలతో నిర్మిస్తున్న సినిమాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. విశ్వరూపం తర్వాత కమల్ హాసన్ కి సరైన సక్సెస్ రాలేదు. ఏ మూవీ చేసినా హిట్ పడలేదు. విశ్వరూపం ..`విక్రమ్` మధ్యలో ఆరేడు సినిమాలు చేసారు. అన్నీ ప్లాఫ్ లే. అప్పటికే సొంత నిర్మాణంలో ప్రయోగాలు.. దీంతో ఆర్థిక ఇబ్బందులు. సరిగ్గా ఇదే టైంలో విక్రమ్ మూవీని సొంత బ్యానర్ పై నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల వసూళ్లూ.. దీంతో అన్ని లెక్కలు సరిచేశారు.
విక్రమ్ హిత్ తో ఉలగనాయగన్ రెట్టించిన ఉత్సాహంలో సొంత నిర్మాణ సంస్థలో వరుస పెట్టి ప్రాజెక్ట్ లు ప్రకటించారు. ఆయన బయట హీరోలతో నిర్మిస్తోన్న చిత్రాలు.. తాను నటిస్తోన్న సినిమాల నెంబర్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడు సినిమాల బడ్జెట్ మొత్తం 700 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనాగా తెలుస్తోంది. ఇండియన్ -2 రూ.250 కోట్ల బడ్టె కాగా.. ఖాకీ మూవీ డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ చేస్తున్న మూవీకి రూ. 150 కోట్ల బడ్జెట్.
మణిరత్నం మూవీకి రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని అంచనా. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అంచనాలు తారా స్థాయికి చేరాయి. విక్రమ్ హిట్ తో కమల్ మూవీలన్నింటికీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. హిట్ పడితే వసూళ్లు.. లాభాలు భారీగా ఉంటాయి.