Kalki 2898 AD : మన పురాణం ఇతిహాసాల్లో పవిత్రంగా భావించే మహాభారతం ని ఆధారంగా తీసుకొని, సైన్స్ ఫిక్షన్ ని జోడించి, భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరో గా నటించిన ‘కల్కి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ కూడా మంచి వసూళ్లను రాబడుతూ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇకపోతే ఈ చిత్రం లో అర్జునుడిగా విజయ్ దేవర కొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వర్థామా గా అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సుప్రీమ్ యాస్కిన్ పాత్రని పోషించిన కమల్ హాసన్ ని ‘కలి’ గా భావించారు ప్రేక్షకులు.
శ్రీ మహావిష్ణువు చివరి అవతారమైన కల్కి పుట్టుకని ఆపేది కలి అని, ఆ కలి పాత్రనే సుప్రీమ్ యాస్కిన్ అని అనుకున్న వారికి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త షాక్ కి గురి చేస్తుంది. అదేమిటంటే సుప్రీమ్ యాస్కిన్ కలి కాదని, అతను కలి క్రింద పని చేస్తున్న ఒక అనుచరుడు మాత్రమేనని, కలి ని కల్కి తప్ప ఎవ్వరూ చంపలేరని అంటున్నారు. అంటే కలి పుట్టుకని ఆపేందుకు ప్రయత్నం చేసే సుప్రీమ్ యాస్కిన్ ని పునర్జన్మ ఎత్తిన కర్ణుడు, అర్జునుడు, అలాగే చిరంజీవిగా మిగిలిన అశ్వర్థామా పోరాడి ఓడిస్తారని. కల్కి పెరిగి పెద్దవాడు అయినా తర్వాత కలి ని సంహరిస్తాడని అంటున్నారు.
రెండవ భాగం లో సుప్రీమ్ యాస్కిన్ పై పోరాటం ఉంటుంది, అలాగే మూడవ భాగం లో పూర్తిగా కల్కి మరియు కలి మధ్య మాత్రమే పోరాటం ఉంటుందని, కలి అంతం తో ఈ యుగం ముగిసినట్టు మూడవ భాగం లో చూపిస్తారని తెలుస్తుంది. మరి మూడవ భాగం లో కలి గా కనిపించబోయేది ఎవరు?, సుప్రీమ్ యాస్కిన్ కంటే పెద్దవాడు అంటే కమల్ హాసన్ కంటే పెద్ద స్టార్ ని కలి పాత్రలో ఉంచాలి. మరి అంత పెద్ద స్టార్ ఎవరు?, ఈ పాత్రకి ఏ హీరో న్యాయం చెయ్యగలడు అనే చర్చలు సోషల్ మీడియా లో ఇప్పటి నుండే మొదలయ్యాయి.