Kalyan Ram : అలా ఉండడానికి నేనేం కుక్కను కాదు.. మొదటి సారి కల్యాణ్ రామ్ రెచ్చిపోయి మాట్లాడాడు..

- Advertisement -

Kalyan Ram : హీరోగా తన కెరీర్ ప్రారంభించినప్పుడు గుర్తింపు తెచ్చుకుని నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు నందమూరి కల్యాణ్ రామ్. గత కొంతకాలంగా తన సినిమాలు కమర్షియల్‌గా హిట్ అవ్వడం మొదలయ్యింది. వైవిధ్యభరితమైన కథలు తనకు హిట్ అందిస్తుండడంతో అదే రూట్‌లో వెళ్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు మరోసారి ‘డెవిల్’ అనే స్పై థ్రిల్లర్ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు కళ్యాణ్ రామ్. ముందుగా తాను తినే మెతుకులపై తన అభిమానుల పేరు ఉంటుందని చెప్తూ.. తన స్పీచ్‌ను ప్రారంభించాడు.

Kalyan Ram
Kalyan Ram

‘‘బింబిసార అప్పుడు చెప్పాను మీకు – మంచి కంటెంట్ ఉండి, మంచి కథ, కథనంతో విజువల్‌ను గొప్పగా చూపించగలిగితే.. ఆడియన్స్ వచ్చి సినిమాను చూస్తారు, ఆదరిస్తారు అనే మాటను మీరు నిజం చేశారు. డెవిల్ కూడా అలాంటి కథే. విజువల్స్ బాగానే ఉన్నాయిగా.. ఫస్ట్ డేనే చూసేస్తారు కదా. మీకు నచ్చిందన్న నమ్మకం మీ అరుపులతోనే నాకు కలిగింది. సినిమా అనేది ఎప్పుడు వన్ మ్యాన్ షో కాదు. ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది. డిసెంబర్ 29న డెవిల్ మీ అందరి ముందుకు వస్తుంది. నా మాట రాసిపెట్టుకోండి చాలా బాగుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కొత్త కథగా కూడా ఉంటుంది’’అని చెప్పాడు.

అభిమానులు డైలాగ్ చెప్పాలని కోరగా.. తాను నిజజీవితంలో కూడా ఇలాగే ఉంటానంటూ సినిమాలోని డైలాగ్ చెప్పారు కళ్యాణ్ రామ్. ‘‘విశ్వాసంగా బతకడానికి, విధేయతతో బతకడానికి కుక్కను అనుకున్నావు రా.. లయన్’’ అనే డైలాగ్‌ చెప్పగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ గురించి ప్రేక్షకులంతా అప్డేట్స్ అడగడం మొదలుపెట్టారు. ‘‘లాస్ట్ టైమ్ తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దు అని. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేసిన తర్వాత ఒక నటుడికి గానీ, ఒక దర్శకుడికి గానీ, ఒక ప్రొడక్షన్ హౌజ్‌కు గానీ చాలా బాధ్యత ఉంటుంది. విజువల్‌లో గానీ, కథలో గానీ చిన్నపాటి తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మేము తెలిసి తప్పు చేయము కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. మీరు చూసేటప్పుడు ఇంతకంటే గోల చేయాలి. త్వరలో గ్లింప్స్ రాబోతోంది. దానికి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా సమయం పడుతుంది. దేవరతో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయజేసి ఓపిక పట్టండి. టీమ్ అంతా కలిసి డేట్ అనౌన్స్ చేస్తాం’’ అంటూ ‘దేవర’ గురించి అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here