Amigos Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే, కానీ ఎందుకో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.నందమూరి అభిమానులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదని విషయం ఈ చిత్రం వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే అర్థం అయ్యిపోతుంది..’భింబిసారా’ చిత్రానికి మొదటి రోజు దాదాపు గా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కానీ అమిగోస్ చిత్రానికి ఫుల్ రన్ లో అయినా అంత వసూళ్లు వస్తాయా అనేది ఇప్పుడు ప్రశ్న..నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ నుండి ఇలాంటి తరహా కథలను కోరుకోవడం లేదని, భింబిసారా తరహా కమర్షియల్ సబ్జక్ట్స్ ని మాత్రమే కోరుకుంటున్నారని ట్రేడ్ పండితులు చెప్తున్నమాట..ఇది ఇలా ఉండగా అమిగోస్ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము.
మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ సినిమాకి అయినా భారీ వసూళ్లే వచ్చే ప్రాంతం నైజాం.. వచ్చే షేర్ లో 40 శాతం వసూళ్లు ఇక్కడి నుండే వస్తాయి, కానీ కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రానికి ఇక్కడే అతి తక్కువ వసూళ్లు వచ్చాయి. నిన్న మొత్తం కలిపి ఈ సినిమాకి ఈ ప్రాంతం లో కోటి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. అంటే షేర్ వసూళ్లు 50 లక్షల లోపే అన్నమాట.
ఇక ఆ తర్వాత సీడెడ్ , ఉత్తరాంధ్ర , కృష్ణ , గుంటూరు , గోదావరి మరియు నెల్లూరు జిల్లాలు కలిపి ఈ సినిమాకి కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందట, వీటిల్లో గుంటూరు జిల్లాలో 33 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతం లో ఇక్కడొక్కటే మంచి ఓపెనింగ్ వచ్చింది, ఆలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రెండు కోట్ల 50 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు.