Auto Ramprasad కి ఆ ప్రాణాంతక వ్యాధి.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్..

- Advertisement -

Auto Ramprasad : ఆటో పంచ్ లకు కేరాఫ్ అడ్రస్ ఆటో రామ్ ప్రసాద్.. కామన్ గా మాట్లాడుకుంటునట్టే ఉంటుంది.. కానీ చక చకా పంచులు పడుతూనే ఉంటాయి. జబర్దస్త్ లో ఆటో పంచ్ ల క్రియేటర్ గా రామ్ ప్రసాద్ రికార్డు ఉంది.. రామ్ ప్రసాద్ ను ఫాలో అవుతూ ఎంతోమంది ఆటో పంచులు వేయడం స్టార్ట్ చేశారు.. కానీ రామ్ ప్రసాద్ కి వచ్చిన క్రేజ్ మరెవరికి రాలేదనడంలో సందేహమే లేదు.. సోషల్ మీడియాలో రామ్ ప్రసాద్ కి ప్రాణాంతక వ్యాధి అయినా క్యాన్సర్ సోకిందని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనిపై రామ్ ప్రసాద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు..

Auto Ramprasad
Auto Ramprasad

ఇటీవల రామ్ ప్రసాద్ ఓ మెడికల్ క్యాప్ పెట్టుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. దాంతో రామ్ ప్రసాద్ కు క్యాన్సర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టింది.. అయితే దీనికి సంబంధించిన ఓ క్లారిటీ ఇచ్చాడు రామ్ ప్రసాద్..

jabardasth comedian Auto Ramprasad cancer attack clarification

ఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల బిజినెస్ పెట్టాడు కిరాక్ ఆర్పీ.. కూకట్ పల్లిలో సూపర్ సక్సెస్ అయిన బిజినెస్ బ్రాంచ్ ను మణికొండలో ఓపెన్ చేసాడు. ఆ ఓపెనింగ్ కు హైపర్ ఆదితో కలిసి రామ్ ప్రసాద్ కూడా హాజరయ్యారు.. అప్పుడే ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రామ్ ప్రసాద్ తనకు క్యాన్సర్ అని ప్రచారం జరుగుతున్న వార్తలు పై స్పందించాడు.. సోషల్ మీడియాలో నా గురించి ఇలా ప్రచారం జరగడం చాలా బాధ కలిగించిందని.. నాకు ఎలాంటి క్యాన్సర్ లేదని క్లారిటీ ఇచ్చాడు..

- Advertisement -

అది తెలిసి తెలియకుండా జరుగుతున్న ప్రచారం అని జబర్దస్త్ రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. నేను ఆ క్యాప్ పెట్టుకున్నది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు ఫోటో.. ఆ ఫోటో వైరల్ అయిందని.. అంతేకానీ తనకి క్యాన్సర్ సోకలేదని క్లారిటీ ఇచ్చారు.. ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించాడు రామ్ ప్రసాద్ .. ఈ విషయం తెలిసి రామ్ ప్రసాద్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here