Kalki 2898 AD : వెయ్యి కోట్ల రూపాయిల బాక్స్ ఆఫీస్ వసూళ్లు బాలీవుడ్ హీరోలకు ఒక కల లాంటిది. కానీ మాకు వెయ్యి కోట్ల క్లబ్ అసలు లెక్కే కాదు అని టాలీవుడ్ పవర్ ఏంటో బాలీవుడ్ జనాలకు రీసౌండ్ వచ్చే రేంజ్ లో రుచి చూపించిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఓపెనింగ్స్ లో కానీ, క్లోసింగ్స్ కలెక్షన్స్ లో కానీ తనకి మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు అని ఆయన బాహుబలి తర్వాత ప్రతీ సినిమాతో నిరూపించుకుంటూనే ఉన్నాడు. అందుకు ‘కల్కి’ చిత్రం ఒక ఉదాహరణ. రాజమౌళి సహాయం లేకుండా కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ అశ్విన్ లాంటి డైరెక్టర్ తో వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టి చూపించిన ప్రభాస్ సినిమా ఇది. ఇప్పటికీ ఈ చిత్రం పలు థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది.
ఓటీటీ యుగం లో ఒక చిత్రానికి ఇంత లాంగ్ రన్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త. నేటి నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ చానెల్స్ లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషల్లో అందుబాటులో ఉండగా, నెట్ ఫ్లిక్స్ లో మాత్రం కేవలం హిందీ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించిన ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఎంతమేరకు ఆకర్షిస్తుందో చూడాలి. గతం లో #RRR చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు కేవలం హిందీ వెర్షన్ ని మాత్రమే తమ ఛానల్ లో అప్లోడ్ చేసారు.
ఆ సినిమాకి గ్లోబల్ వైడ్ గా ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చిన అద్భుతమైన రీచ్ కారణంగానే. ఇప్పుడు కల్కి చిత్రం కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని మారుతీ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాజాసాబ్‘ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల కాబోతుంది. అలాగే రీసెంట్ గా ఆయన హను రాఘవపూడి తో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతుంది.