Kalki Movie : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. మన టాలీవుడ్ నుండి మూడవ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాగా నిల్చి, ప్రభాస్ కి రెండవ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాసర్ గా నిల్చింది. ఇకపోతే 37 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ దాదాపుగా అన్నీ ప్రాంతాలలో క్లోజ్ అయ్యాయి. ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది పరిశీలిద్దాం.

నైజాం లో ఈ చిత్రం #RRR కి ఏమాత్రం తీసిపోని రన్ ని రాబట్టిందనే చెప్పాలి. దాదాపుగా 93 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. సీడెడ్ లో ఈ చిత్రం విడుదలైన రోజు ఇలాంటి మాస్ ప్రాంతం లో ఆడుతుందా అనే సందేహాన్ని బయ్యర్స్ వ్యక్తపరిచారు. కానీ ఈ సినిమా అనూహ్యంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఉత్తరాంధ్ర లో 21 కోట్ల రూపాయిలను వసూలు చేసిన ఈ చిత్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం చిత్రం రికార్డుని మాత్రం బ్రేక్ చెయ్యలేకపోయింది.
అలా వైకుంఠపురం లో చిత్రం ఈ ప్రాంతం లో దాదాపుగా 23 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో 12 కోట్ల 40 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 9 కోట్ల 45 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 11 కోట్ల 17 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 11 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 6 కోట్ల 12 లక్షల రూపాయిలను రాబట్టి సంచలనం సృష్టించింది. మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కి కలిపి 185 కోట్ల రూపాయిల షేర్, 292 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అలాగే కర్ణాటక లో 36 కోట్లు, తమిళనాడు లో 22 కోట్లు, కేరళలో 13 కోట్లు, హిందీ లో 150 కోట్లు, ఓవర్సీస్ లో 130 కోట్లు, మొత్తం మీద 534 కోట్ల రూపాయిల షేర్, 1050 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.