OTT Movies : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు మించి ఉండడంతో అద్భుతమైన వసూళ్లను రాబడుతూ వెయ్యి కోట్ల రూపాయిల వైపు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొదటి వారం లోనే సలార్ క్లోసింగ్ వసూళ్లను కొల్లగొట్టబోతుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువగా ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు.
బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఈ చిత్రం చరిత్ర తిరగరాస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపుగా 175 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే విడుదలైన 5 రోజులకే ఈ సినిమాకి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకి రావడం తో మేకర్స్ కంగారు పడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆగష్టు 15 వ తారీఖు నుండి స్ట్రీమింగ్ కానుంది అట. సాధారణంగా ఓటీటీ విడుదల తేదీలు సినిమా థియేట్రికల్ రన్ పూర్తిగా అయిపోయిన తర్వాత ప్రకటిస్తూ ఉంటారు మేకర్స్. కానీ సినిమా ఇంత అద్భుతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఓటీటీ విడుదల తేదీ బయటకి రావడం పై మేకర్స్ ఆగ్రహం ని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా వసూళ్ల ట్రెండ్ ని చూస్తూ ఉంటె వెయ్యి కోట్లు కాదు, ఏకంగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత అశ్వినీదత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అంతటి భారీ వీకెండ్ తర్వాత ఈ సినిమాకి సోమవారం నాడు దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ఇండియా నుండి వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ట్రెండ్ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయట. సలార్ కి ఈ స్థాయి వసూళ్లు రాకపోవడం మరో విశేషం. ఆ సినిమాకి వస్తాయని అనుకున్న వసూళ్లు, కల్కి కి వస్తున్నాయని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో ఆనందం ని వ్యక్తపరుస్తున్నారు.