Kalki 2898 AD : ‘కల్కి’ వెయ్యి కోట్లు ఇంకా దాటలేదా..? ఇప్పటి వరకు వచ్చిన నిజమైన వసూళ్లు ఇవే!

- Advertisement -

Kalki 2898 AD : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ ఇటీవలే విడుదలై మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. విచిత్రం ఏమిటంటే నిన్న విడుదలైన శంకర్ – కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇండియన్ 2’ కంటే ఎక్కువగా నేడు అన్నీ చోట్ల కల్కి చిత్రం ఆధిక్యత ప్రదర్శించింది. బుక్ మై షో యాప్ లో ఇండియన్ 2 చిత్రానికి గంటకి 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతుంటే, కల్కి చిత్రానికి గంటకు గాను 24 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. 17 వ రోజు ఒక సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం చూసి చాలా కాలం అయ్యింది. ముఖ్యంగా ఇటీవల కాలం లో ఒక స్టార్ హీరో సినిమాకి ఈ స్థాయి లాంగ్ రన్ రావడం చూడలేదు.

 Kalki 2898 AD
Kalki 2898 AD

అయితే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది అంటూ సోషల్ మీడియా లో కల్కి మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇంకా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోలేదు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 16 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 906 కోట్ల రూపాయిల గ్రాస్, 467 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు, రేపు వీకెండ్ కావడం ఈ చిత్రానికి మరో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపటికి ఈ చిత్రం 960 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని ముట్టుకునే అవకాశం ఉంది.

Image

- Advertisement -

త్వరలో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కచ్చితంగా అందుకునే అవకాశాలు ఉన్నాయి కానీ, ఇప్పటికి అయితే ఇంకా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోలేదు. ఒక పక్క మూవీ టీం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వేసి ఉన్న పోస్టర్ ని సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, ప్రభాస్ మాత్రం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కలెక్షన్స్ లేని పోస్టర్ ని అప్లోడ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు తనకి బాక్స్ ఆఫీస్ నంబర్స్ మీద ఎలాంటి ఆసక్తి లేదని, తన పనిని తానూ చేసుకోవడమే తెలుసునని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు.

Image

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here