Kalki 2898 AD Trailer : పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి వెహికల్, యానిమేషన్ సిరీస్ తో సినిమాపై భారీ హైప్ పెరిగింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ బజ్ ను భారీ లెవల్ లో పెంచేందుకు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక నేడు జూన్ 10న కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ముందుగానే ప్రకటించారు.

కల్కి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోగా… ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కి సినిమాకు గనుక మ్యాచ్ చేయగలిగితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో విశ్వ నటుడు కమల్ హాసన్ షాకింగ్ లుక్ కూడా మెస్మరైజ్ చేసింది. సినిమాలోని మిగిలిన రోల్స్ అన్నింటినీ చిన్నగా ఇంట్రడ్యూస్ చేసి వదిలారు. ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ గాల్లో ఎగిరే షాట్ మరో లెవల్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ నెల 27న మనం ఒక విజువల్ వండర్ ని చూడబోతున్నామని ట్రైలర్ ను బట్టి చూస్తే అర్థం అవుతుంది.
ప్రభాస్ మాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ లవర్లను ఇంప్రెస్ చేసే అవకాశం ఈ సినిమాకు ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఇక 24 గంటల్లో యూట్యూబ్ లో ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి, ట్రైలర్ రిలీజ్ చేసిన 30నిమిషాల్లోనే దాదాపు 10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుండగా అంచనాలను అందుకుని రూ.1000 కోట్ల బొమ్మగా నిలుస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానితో పాటు మరికొంతమంది స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.