Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఆ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకన్నా ముందే అసలు కల్కి అంటే ఏంటి? .. ఆ వింత ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పేందుకు స్క్రాచ్ పేరిట మూవీ టీం కొన్ని ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మే 18న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని రిలీజ్ చేశారు.
దాంతో పాటు ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేస్తాననడంతో సోషల్ మీడియా మొత్తం కల్కీ 2898 ఏడీ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఆ బుజ్జి ఎవరో తెలుసుకోవాలని అంతా తెగ వెయిట్ చేస్తున్నారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా కల్కీ సినిమా టీం చెప్పిన టైం కంటే లేటుగా ఆ స్క్రాచ్ ఎపిసోడ్ రిలీజ్ చేసింది. కల్కి 2898 ఏడీ మూవీ హీరో భైరవ తన బుజ్జిని ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు.
బుజ్జి విషయమై తొలుత ప్రభాస్ పెట్టిన పోస్ట్ చూసి తను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. చివరకు బుజ్జి అంటే ఒక కారు అనే విషయాన్ని తాజా ఎపిసోడ్ ద్వారా రివీల్ అయింది. కల్కీ సినిమాలో ప్రభాస్ వాడేది నిజంగానే సూపర్ ఫ్యూచరిస్టిక్ కారు అనే విషయం పై స్పష్టత వచ్చింది. అంతేకాకుండా ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ కూడా ఎప్పటి లాగే కల్కి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందన్న సంగతి అర్థం అవుతుంది.

స్క్రాచ్ వీడియో సినిమాలోని ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ సాగింది. వీడియోలో ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి అనగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. బాడీని కోల్పోయిన బుజ్జి ఒక సూపర్ కారుకు అటాచ్ చేస్తారు. అంటే ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో బుజ్జి ఒక పెద్ద రోబోలాగా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోబో హెడ్ ని తీసుకెళ్లి కారుకు తగిలిస్తున్నారు. పైగా తన బాడీని ఈ హెడ్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్ బుజ్జిని మే 22న రివీల్ చేస్తామన్నారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు రెడీ అవుతోంది.
Presenting '𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji' from #Kalki2898AD!!!https://t.co/PwgcOBfJcf @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/tfmW7EtYiF
— Kalki 2898 AD (@Kalki2898AD) May 18, 2024