Kalki 2898 AD రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రమిది. ఈ సినిమాకి వచ్చినంత పాజిటివ్ టాక్ ఈమధ్య కాలం లో ఏ ప్రభాస్ సినిమాకి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ సినిమా విడుదలై నేటికీ 11 రోజలు పూర్తి అయ్యాయి. ఈ 11 రోజులకు గాను ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 372 కోట్ల రూపాయిల బిజినెస్ జరగగా, 11 రోజులకు గాను 420 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు.
అంటే ఇప్పటికి అధికారికంగా 48 కోట్ల రూపాయిల లాభం వచ్చిందన్నమాట. ఇక ఆదివారం రోజు అనగా నిన్న ఈ చిత్రానికి కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ప్రాంతాల వారీగా 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ కలుపుకొని 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే సీడెడ్ ప్రాంతం లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 27 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ ఒక్క ప్రాంతం లో భారీ నష్టాలు తప్పేలా లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అలాగే ఉత్తరాంధ్ర లో 18 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 11 కోట్ల రూపాయిలు, వెస్ట్ గోదావరి లో 8 కోట్ల రూపాయిలు, గుంటూరు లో 10 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 9 కోట్ల 80 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక లో 27 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 17 కోట్ల రూపాయిలు, కేరళలో 9 కోట్ల రూపాయిలు, నార్త్ ఇండియా లో 105 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో వందకోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 11 రోజులకు గాను 420 కోట్ల రూపాయిల షేర్, 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి కల్కి.