Kajal Aggarwal సౌత్ ఇండియా లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని టాప్ స్టార్ హీరోయిన్ గా సుమారుగా దశాబ్దం పై నుండి కొనసాగుతున్న నటి కాజల్ అగర్వాల్.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఒకప్పుడు దూసుకెళ్లిన ఈ చందమామ, పెళ్లి తర్వాత కాస్త విరామం ఇచ్చింది.ఇప్పుడు ఆమెకి కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బిజీ గా మారిపోయింది.ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్నన్ని సినిమాలు కుర్ర హీరోయిన్స్ కి కూడా చాలామందికి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రం లో నటిస్తున్న కాజల్ అగర్వాల్, ఇప్పుడు బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈరోజు ఆమె షూటింగ్ లొకేషన్ లోకి అడుగుపెట్టగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇది ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాలో నటింపచేసుందుకు చాలా రోజుల క్రితమే అడిగాడు.కానీ అప్పట్లో ఒక కుర్ర హీరోయిన్ కి తల్లిగా నటించాల్సి వస్తుందనే కారణం తో ఈ చిత్రం లో భాగం అవ్వడానికి ఒప్పుకోలేదు.కానీ నిర్మాతలు భారీ లెవెల్ పారితోషికం ఆఫర్ చెయ్యడం తో కాదనలేక ఒప్పేసుకుంది.ఈ సినిమాలో బాలయ్య బాబు కి కూతురిగా ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది.

అంటే కాజల్ అగర్వాల్ కి కూడా ఆమె కూతురే కదా.కాజల్ పాత్ర ఈ చిత్రం లో కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుందట.ఈ 40 నిమిషాల కోసం ఆమె దాదాపుగా మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని పుచ్చుకుంటున్నట్టు తెలుస్తుంది.రీ ఎంట్రీ తర్వాత ఆమె అందుకుంటున్న భారీ పారితోషికం ఇదే.చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను ఎలా అలరించబోతుందో అనేది.