Jyothika : ఈ విషయంలో సూర్యకు నాకు రోజూ గొడవలు అవుతాయి.. ఎవరికీ తెలియని విషయం చెప్పిన జ్యోతిక

- Advertisement -

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు నటి జ్యోతిక. చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించిన అతికొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సహ నటులపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. సూర్యలో నచ్చిన, నచ్చని విషయాలను చర్చించారు. తమిళంలో ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు జ్యోతిక ఆసక్తికర సమాధానమిచ్చారు.

‘చాలా రోజుల నుంచి నా సినిమాల్లో మెయిన్‌ లీడ్‌ నేనే చేస్తున్నాను. అందుకే వేరే హీరో కావాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా మంచి కథ ఉంటే హిందీలో సూర్యతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పటివరకు చేసిన హీరోలంటే నాకెంతో గౌరవం. సినిమా బాగా రావడం కోసం మమ్ముట్టి ఎంత కష్టమైనా పడతారు. రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌డమ్‌ ఉన్న హీరో. విజయ్‌ స్థిరత్వం ఉన్న నటుడు’ అని ప్రశంసించారు.

- Advertisement -

సూర్య గురించి చెబుతూ.. ‘అతడు అందరినీ గౌరవిస్తాడు. అందరి కోసం సమయాన్ని కేటాయిస్తాడు. సూర్యలో ఈ విషయం నాకు చాలా నచ్చుతుంది. స్నేహానికి విలువిస్తాడు. సహనం ఎక్కువ. అవతలి వ్యక్తి మాట్లాడేది ఓపిగ్గా వింటాడు. ఇంట్లో నేను ఎక్కువ మాట్లాడుతుంటా.. సూర్య వింటూ ఉంటాడు. దేన్నైనా తట్టుకోగలడు. అతడిలో నచ్చని విషయానికొస్తే.. బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడుపుతాడు. ప్రతిరోజు ఉదయం మా ఇద్దరికీ ఈ విషయంలో ఫైట్స్‌ జరుగుతుంటాయి’ అని జ్యోతిక సరదాగా చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here