Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరుకి స్టార్ హీరోనే కానీ,అతని ప్రవర్తన, మాట్లాడే తీరు, ఇతరులతో నడుచుకునే నడవడిక, ఇవన్నీ కూడా మన మిత్రులలో చూసినట్టుగానే అనిపిస్తాది. అంత సింపుల్ గా ఉండే వ్యక్తి ఆయన. మన దోస్తులు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మనతో ఎంత సరదాగా అయితే గడుపుతారో, ఎన్టీఆర్ కూడా అలాగే ఉంటాడు.

అభిమానులతో కూడా ఆయన మాట్లాడే తీరు మన ఇంటి మనిషిని గుర్తు చేస్తుంది. అయితే ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా ఊరా మాస్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఏది దాచుకోడు. #RRR మూవీ షూటింగ్ ప్రొమోషన్స్ సమయం లో యాంకర్ సుమ తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా కోపం లో ఉన్నప్పుడు మీరేమి చేస్తారు అని అడగగా, దానికి రామ్ చరణ్ చేతిలో ఉన్న మైక్ విరిసి పగలగొడుతాను అని అంటాడు.

అప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘మైక్ విరగొట్టి, ఒక్క పెద్ద బూతు మాట వదులుతాడు’ అని అంటాడు. అప్పుడు సుమ బూతుల గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా తారక్ అని అంటుంది. ఎన్టీఆర్ బయట బూతులు ఎలా మాట్లాడుతాడో రీసెంట్ గా విడుదలైన ఒక వీడియో నే ఉదాహరణ. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.

గోవాలో ప్రస్తుతం ‘దేవర’ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్రేక్ సమయం లో ఎన్టీఆర్ తన తోటి స్నేహితులతో కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్లో ఒక సందర్భం లో ఆయన ఎవరినో ‘చావ దె***తా’ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. దీనిపై సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానుల నుండి నెగటివిటీ ఏర్పడింది.
Saaava Denthaaaa anta Tiger🤣😂 pic.twitter.com/l3DQfcRdMF
— JW (@Johnni6Walker) October 31, 2023