Prabhas : ప్రభాస్ కల్కి చిత్రం లో చిరంజీవి గా జూనియర్ ఎన్టీఆర్ నటించడం ఏమిటి?, అసలు ఈ సినిమాకి చిరంజీవి కి లింక్ ఏమిటి, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఆయనలాగా నటిస్తాడు అని మీరంతా ఇప్పుడు అనుకొని ఉండొచ్చు. కానీ చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి కాదు, మన పురాణాల్లో సప్త చిరంజీవులుగా పిలబడే వారిలో ఒక చిరంజీవి అన్నమాట. పురాణాల ప్రకారం హనుమంతుడు, అశ్వర్దమా, బలి, కృపాచార్య, పరశురాముడు, విభీషణుడు, వేదవ్యాసుడు అని 7 మంది చిరంజీవులు ఉన్నారు.
చిరంజీవి అంటే ఎప్పటికీ మరణం లేని వాళ్ళు అన్నమాట. వీళ్లంతా ఇప్పటికీ భూమి మీదనే జీవించి ఉన్నారు. అయితే ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ సినిమాలో ఈ చిరంజీవులు ఉన్నారట. ఇప్పటికే అశ్వద్దామా పాత్రని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో చిరంజీవి ‘పరశురాముడి’ పాత్ర ని జూనియర్ ఎన్టీఆర్ చెయ్యబోతున్నట్టుగా గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్ లాంటి లెజెండ్స్ ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ ఈ చిత్రం లో అతిథి పాత్ర చేస్తున్నట్టుగా గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రచారం లో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా పరశురాముడి పాత్రలో అతిథి గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు జరగలేదు కానీ, అతి త్వరలోనే జరగబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అదే కనుక జరిగితే టాలీవుడ్ ఈ సినిమా సృష్టించే రికార్డ్స్ ని రాజమౌళి సినిమా కూడా అందుకోలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఈ సినిమా మే 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.