టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా రంగంలో ఎన్టీరామారావు అడుగు పెట్టాక రాజ్యాన్ని ఏలాడు. ఆయన వారుసులు ఎందరో సినీ రంగానికి వచ్చారు. కానీ కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో హరికృష్ణ, బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు ఉన్నారు. వీరిలో టాప్ హీరోలుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చినా ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారారు. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘అశోక్’, ‘నరసింహుడు’ సినిమాలు ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ పక్కన నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సినిమాల తరువాత ఎన్టీఆర్, సమీరారెడ్డిని పెళ్లి చేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సమీరా రెడ్డి తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోల పక్కన నటించింది. మెగాస్టార్ చిరంజీవితోనూ ‘జై చిరంజీవ’ సినిమాలో అలరించింది. అయితే ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఆ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీలో అడుగుపెట్టాలని ఎంతో ఆశపడిందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ఆ తరువాత తేలిన విషయమేంటంటే… ఎన్టీఆర్, సమీరారెడ్డి మంచి స్నేహితులుగా విడిపోయారు.