Junior NTR అంతర్జాతీయ స్థాయిలో #RRR చిత్రానికి దక్కుతున్న పురస్కారాలతో మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేకపోతున్నాడే అని అభిమానులు నిన్న మొన్నటి వరకు ఎంతో బాధపడ్డారు.అసలు ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి వస్తాడా లేదా అని కంగారు పడ్డారు.జీవితం లో వచ్చే అరుదైన గౌరవాలలో ఒకటి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొనడం.అలాంటి ఈవెంట్ లో తన సినిమాకి అవార్డు వస్తున్నా కూడా, ఆ ఆనందం ని పంచుకోవడానికి ఎన్టీఆర్ అక్కడ లేకపోతే చాలా బాధగా ఉంటుంది అని ఫ్యాన్స్ వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న చనిపోవడం వల్ల ఆయన పెద్ద కర్మ కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకు వెళ్లకూడదని ఎన్టీఆర్ ఇటీవల జరిగిన అంతర్జాతీయ అవార్డ్స్ వేడుకలకు హాజరు కాలేదు.ఇప్పుడు ఆ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి.ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు అమెరికా కి చేరుకున్నాడు.ఆయనకీ ఫ్యాన్స్ నుండి అద్భుతమైన ఆహ్వానం దక్కింది.

కాసేపు సరదాగా ఎన్టీఆర్ తన NRI ఫ్యాన్స్ తో ముచ్చటించారు.వాళ్ళతో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా మెలిగిన తీరు చూస్తే ఇంత పెద్ద స్టార్ స్టేటస్ ఉన్న హీరో ఇలా ఇంత సింపుల్ గా ఎలా ఉండగలరు అని ఆశ్చర్యపోక తప్పదు.ఆ వీడియోస్ ని మీరు క్రింద చూడవచ్చు.ఎన్టీఆర్ తన అభిమానులతో ఎంతో స్నేహం గా మాట్లాడడమే కాకుండా, వాళ్ళ తల్లితండ్రులతో కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు.

‘ఎలా ఉన్నారు అమ్మా, బాగున్నారా..మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషం గా ఉంది..కలుద్దాం త్వరలోనే’ అంటూ ఒక అభిమాని తల్లి తో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇక ఆ తర్వాత కొంత మంది అభిమానులు ‘ఒక్కసారి మా డల్లాస్ కి రా అన్నయ్య’ అని అడుగుతారు, ‘డల్లాస్ కా, వామ్మో వస్తే బ్రతకనిస్తారా మీరు నన్ను’ అంటూ సరదాగా అంటాడు.అప్పుడు ఒక అభిమాని ‘150 కార్లతో మీకు ఘానా స్వాగతం పలకడానికి సిద్ధం గా ఉన్నాము అన్నా’ అంటాడు, దానికి ఎన్టీఆర్ ‘వామ్మో’ అంటూ ఇచ్చే క్యూట్ రియాక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోతారు.
NTR @tarak9999 talking to @Bobby_boy___’s mother on video call 😃 pic.twitter.com/IMIzhBtt4e
— …. (@ynakg2) March 7, 2023
My life time memory 🥹🥹🥹🥹 Last time kalisindhi gurthu pettukunnadu hero @tarak9999 Venue lo ki entry avvagane na gurinchi matladadu 😭😭😭😭😭😍😍😍 pic.twitter.com/7WJkoQdpJ1
— Tonieee (@Tony_1439) March 7, 2023
Okasari Dallas ki raa anna
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) March 7, 2023
బ్రతకనిస్తారా అక్కడికి వస్తే @tarak9999 😂❤️🤣 pic.twitter.com/kEutw8ZLZZ