Raveena Rajput : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన మొట్టమొదటి చిత్రం ‘నిన్ను చూడాలని’ అనే విషయం అందరికీ తెల్సిందే.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ లుక్ ఉన్న ఒక హీరోకి ప్రేమ కథాచిత్రలు అసలు ఏమాత్రం సరిపడవని మొదటి సినిమాతోనే ప్రూవ్ అయ్యింది.ఆది చిత్రానికి ముందు వరకు ఆయన యూత్ ఫుల్ మరియు ప్రేమ కథా చిత్రాలే చేసాడు.

అందులో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఒక్కటి సూపర్ హిట్ అవ్వగా, నిన్ను చూడాలని మరియు సుబ్బు వంటి చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.ఇక అప్పటి నుండి ఎన్టీఆర్ లవ్ స్టోరీస్ వైపు కనెత్తి కూడా చూడలేదు..అయితే ‘నిన్ను చూడాలని’ చిత్రం లో హీరోయిన్ గా చేసిన రవీనా రాజ్ పుట్ కి ఇదే తొలి సినిమా మరియు ఆఖరి సినిమా అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

రామోజీ రావు నిర్మాతగా హరి కృష్ణ గారి అబ్బాయి గా ఎన్టీఆర్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు అంటే కచ్చితంగా నందమూరి అభిమానుల్లో అంచనాలు కనీస స్థాయిలో అయినా ఉంటాయి.కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లను పెట్టుకుంటేనే బాగుంటుందని రామోజీ రావు అనుకున్నాడు.కానీ ఆ చిత్ర డైరెక్టర్ ప్రతాప్ మాత్రం కొత్త హీరోయిన్ తో చేస్తేనే ఫ్రెష్ లుక్ ఉంటుందని కొత్త హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ చెయ్యడం మొదలు పెట్టారు.

అయితే అప్పటికే విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘ఒంటరి పోరాటం’ అనే సినిమాలో బాలనటిగా చేసిన రవీనా రాజ్ పుట్ , హీరోయిన్ గా ఇండస్ట్రీ లో నిలదొక్కుకునేందుకు అవకాశాల కోసం ఆడిషన్స్ ఇస్తూ వచ్చింది.. ఆ సందర్భం లోనే డైరెక్టర్ ప్రకాష్ ఆమె ఆడిషన్ చేసి ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం తీసుకున్నాడు. అందం తో పాటుగా అభినయం కూడా ఉన్నప్పటికీ ఎందుకో ఈమె ఈ సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు.
అవకాశాలు రాకనో, లేదా ఇండస్ట్రీ లో ఆమెకి ఏదైనా చేదు అనుభవం ఎదురైందో సరైన కారణం తెలీదు కానీ, ఆ ఒక్క సినిమా తోనే తన కెరీర్ ని ముగించేసి, బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని పెళ్ళాడి అతనితోనే సంసారం జీవితాన్ని సాగిస్తూ వచ్చింది.. అయితే రీసెంట్ గా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.. ఇప్పుడు ఆమె ఎలా తయారు అయ్యిందో మీరే చూడండి.
