JR NTR : RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ తో ఒక చిత్రం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత అభిమానుల ఊహకి కూడా అందని రేంజ్ లో ఆయన ‘వార్ 2 ‘ లో నటించబోతున్నాడట.

2019 వ సంవత్సరం లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో ‘వార్’ అనే చిత్రం వచ్చింది.అప్పట్లో ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.సుమారుగా 350 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా హృతిక్ రోషన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.అలాంటి సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాం అని యాష్ రాజ్ ఫిలిమ్స్ ఎప్పుడో ప్రకటించింది.

ఇందులో హీరో హృతిక్ రోషన్ అనే విషయం అందరికీ తెలుసు కానీ, ఈ సీక్వెల్ లో ఆయనని ధీ కొట్టే పాత్ర ఎవరు చెయ్యబోతున్నారు అనే దానిపై క్లారిటీ ఉండేది కాదు, ఇప్పుడు ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చెయ్యబోతున్నాడు అని అధికారిక ప్రకటన రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యింది.అయితే ఎన్టీఆర్ ని నెగటివ్ రోల్ లో చూసి అభిమానులు జీర్ణించుకోగలరా లేదా అని విశ్లేషకులు బయటపడుతున్నారు.

ఎందుకంటే ఎన్టీఆర్ ఇక్కడ పెద్ద మాస్ హీరో, #RRR చిత్రం లో ఆయన పాత్ర బాగా తగ్గిందని ఫ్యాన్స్ ఎంత రచ్చ చేసారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా నెగటివ్ రోల్ అనే వార్త వినిపిస్తుండడం తో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది. ఒకవేళ నెగటివ్ క్యారక్టర్ అయ్యినప్పటికీ కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సబ్జెక్టు కాబట్టి కచ్చితంగా ఫ్యాన్స్ అంగీకరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు.
