దేవర ఆఫర్ కోసం జాన్వీ జాన్వీ కపూర్ అలా చేసిందా.. నిజం ఒప్పుకుందిగా..

- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. తాను తాజాగా వరుణ్ ధావన్ సరసన బవాల్ సినిమాలో చేసింది. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తాను త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. అదే సినిమాపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తల్లి శ్రీదేవి లాగే తనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన దివంగత శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది జాన్వీ. ఇప్పటి వరకు పదివరకు సినిమాలు చేసినా సరైన హిట్ కొట్టలేదు. దీంతో ఎన్టీఆర్ తో నటిస్తున్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది జాన్వీకపూర్. దేవర సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా జాన్వీని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . షూటింగ్ కూడా మొదలైంది. ఇండస్ట్రీలో ఇంతమంది పాపులర్ హీరోయిన్లు ఉన్నా జాన్వీకి ఆఫర్ ఎలా వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయాన్నే జాన్వీ చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే జాన్వీ మాట్లాడుతూ “కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలియగానే నేనే హీరోయిన్ అయితే బాగుండని ఎన్నో సార్లు అనుకున్నాను. అదే టైంలో చాలామంది హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నట్లు విన్నాను. వారు నన్ను కూడా అప్రోచ్ అయితే బాగుండని అని అనుకున్నా.. దేవుడి నన్నే సెలక్ట్ చేయాలని దండం కూడా పెట్టుకున్న.. పూజలు కూడా చేశా. ఫైనల్లీ పూజలు ఫలించాయి. డైరెక్టర్ కొరటాల శివ.. మా నాన్న గారితో మాట్లాడారు.. వెంటనే నేను ఓకే అనేశాను .. అలా ఈ ఆఫర్ నా చేతికి వచ్చింది. ఎన్టీఆర్ గారితో కలిసి నటించడం నా అదృష్టం “అంటూ చెప్పింది. జాన్వీకి ఎన్టీఆర్ సరసన అవకాశం రావడం దేవుడి దయ. ఈ సినిమాకు ముందు ఎన్ని అవకాశాలు వచ్చినా పరోక్షంగా వాటిని రిజక్ట్ చేసిందట జాన్వీకపూర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here