జాన్వీ కపూర్: బాలివుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరియాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో మంచి మార్కులు వేయించుకుంది.. అయితే, బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేదు.ఇక ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన కోరిక ఉందని చెప్పుకొచ్చింది. ఆమె కోరిక ఎన్టీఆర్ 30 సినిమాతో నెరవేరబోతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా జాన్వీ కాపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది… అది నెట్టింట ఓ రేంజులో వైరల్ అవుతుంది..

ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. జాన్వికపూర్ ఫిలింఫేర్ స్టేజ్ మీదికి పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుందట. కానీ అలా పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఐదు నిమిషాల ముందే తను వేసుకున్న గౌన్ జిప్ ఊడిపోయిందట. ఇక స్టేజి పర్ఫామెన్స్ చేయడానికి ఐదు నిమిషాలు ఉండడంతో చేసేదేమీ లేక కారులోనే జాన్వీ కపూర్ గౌన్ జిప్ ని కుట్టించుకోవాల్సి వచ్చిందట. ఇక జాన్వి కపూర్ తన హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కుర్ర కారును ఫిదా చేస్తూనే ఉంటుంది…

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాలోనే కాకుండా జాన్వీ కపూర్ కి రాంచరణ్ హీరోగా రాబోతున్న మరో సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టు సమాచారం. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వీకపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు తో పాటు మరో రెండు ప్రాజెక్టు లలో చేస్తుంది.. తెలుగులో ఒక్క సినిమా హిట్ అయితే చాలా వరుస ఆఫర్లు క్యూ కడతాయని శ్రీదేవి అభిమానులు అంటున్నారు..