Janhvi Kapoor : బాలీవుడ్ మిలీనియల్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. రోజుకో రకమైన ఔట్ ఫిట్ లో అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేసే జాన్వీ తాజాగా మరోసారి తన అందంతో మైమరిపించింది. ప్రస్తుతం జాన్వీ కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా జాన్వీ వైట్ కలర్ డ్రెస్సులో ఫొటోషూట్ చేసింది. ఈ డ్రెస్సులో జాన్వీ థైస్ చూపిస్తూ హాటుగా పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మళ్లీ జాన్వీపై మనసు పారేసుకున్నారు. అతిలోక సుందరి అందం అంతా జాన్వీకి వచ్చిందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఫొటో షూట్ లో జాన్వీ వైట్ డ్రెస్సులో అందాల ఆరబోతతో అదరగొట్టింది. థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. స్లీవ్ లెస్ టాప్ లో మెస్మరైజ్ చేసింది. అందాల ఆరబోతకు జాన్వీ ఏ మాత్రం నో చెప్పదు. సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా ఉండటానికే ఇష్టపడుతుంది జాన్వీ. అందుకే ఘాటుగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తన బోల్డ్‌నెస్ గురించి జాన్వీ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని కూడా చెప్పింది. తాను సోషల్ మీడియాను అంత సీరియస్‌గా తీసుకోలేదని.. అక్కడ కాస్త బోల్డ్‌గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని చెప్పుకొచ్చింది. తను అందంగా కనిపిస్తే 5 మంది తన ఫొటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్త సులువు అవుతుందని.. అందుకే అలా చేసున్నానని చెప్పింది జాన్వీ.

ఫొటోషూట్లలోనే కాదు జాన్వీ తన మాటల్లోనూ బోల్డ్ నెస్ చూపించిందని కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు. జాన్వీ ఇచ్చిన క్లారిటీతీ ఇది కూడా నిజమే కదా బాస్ అంటూ ఈ బ్యూటీ మాటలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక జాన్వీ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ బ్యూటీ సందడి చేయనున్నట్లు తెలిసిందే.