Janhvi Kapoor : బాలివుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే..చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో ఓ రేంజులో ఊపేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫోటోలకు పోజులిస్తూ వస్తుంది..అంతేకాదు బాలివుడ్ లో ఎటువంటి ఫంక్షన్ జరిగిన కూడా జాన్వీ దర్శనం ఇస్తుంది..ఇక ఆమె వేసే డ్రెస్సులు ఏ రేంజులో ఉంటాయో అందరికి తెలిసిందే..అయితే తన బాయ్ ఫ్రెండ్ తో టైమ్ దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తుంది.. కొన్నిసార్లు కెమెరాలకు చిక్కుతూ వార్తల్లో నిలుస్తుంది..ఇప్పుడు మరోసారి బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ మారింది..
గ్లామరస్ బ్యూటీగా నిత్యం వార్తల్లో నిలిచే జాన్వీ కపూర్ ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో ఆమె డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు స్పందించని ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి ప్రియుడితో కనిపించింది.. బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియాతో కలిసి ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఇద్దరూ వైట్‌డ్రెస్‌లో ట్విన్నింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
మొన్నమధ్య అంబాని ఇంట్లో జరిగిన పార్టీకి ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లారు.. అప్పుడు కూడా మీడియాకు చిక్కింది..గతంలో పలు పార్టీలకు కలిసి హాజరైన జాన్వీ-శిఖర్‌లు ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం కానుంది.. అంతే కాదు బాలివుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తుంది.. ఎంత ఫిట్ గా ఉన్నా కూడా ఎప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తుంది.. ఏదేమైనా అందంలో తల్లిని మించిపోయింది.. ఎప్పుడూ ఎలాంటి ఫోటోలను పెడుతుందా అని వెయిట్ చేస్తుండటం విశేషం..