పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..?, ఆయన సినిమా లో అవకాశం వచ్చిందంటే గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు దక్కినట్టే. అలాంటి రామ్ చరణ్ సినిమాలో నటించడానికి నో చెప్పిందట ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అయ్యినప్పటికీ ఇంకా ఈమె శ్రీదేవి కూతురు అనే గుర్తింపు తోనే కొనసాగుతుంది.

ఈమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. సినిమా షూటింగ్స్ లో కంటే కూడా ఎక్కువగా పార్టీలు, పబ్బులలోనే కనిపిస్తూ ఉంటుంది ఈమె. అలాంటి జాన్వీ కపూర్ కి టాలీవుడ్ అంటే చులకన. ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. మేకర్స్ ఆమెని హీరోయిన్ గా తీసుకునేందుకు సంపాదించిన విషయం వాస్తవమే , కానీ ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకోలేదట. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా జాన్వీ కపూర్ పై విరుచుకుపడుతున్నారు, ఆమెకి వ్యతిరేకంగా ట్రెండింగ్ కూడా చేస్తున్నారు.

కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేకపోయినా బలుపు కి ఏమాత్రం తక్కువ లేదు, మీ అమ్మ పేరు చెప్పుకోకపోతే నీకు కనీసం గుర్తింపు కూడా ఉండదు అంటూ ఆమెని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రం తో ఫుల్ బిజీ గా ఉన్న రామ్ చరణ్, ఈ సినిమా పూర్తి అవ్వగానే బుచ్చి బాబు సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నారు . ఈ చిత్రం రంగస్థలం తరహాలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అట.
