Jahnvi Kapoor : యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ #RRR చిత్రం తర్వాత పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎగబాకిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. చాలా కాలం క్రితం షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా పరిగెడుతూ దాదాపుగా 70 శాతం పూర్తి చేసుకుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రం జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమెకి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం. ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్నీ స్వయంగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది అట.

అదేమిటి అంటే జాన్వీ కపూర్ కి దేవర సెట్స్ ని వదిలి వెళ్లాలని అనిపించట్లేదట. షూటింగ్ పూర్తి అవ్వగానే అప్పుడే వెళ్లిపోవాలా?, ఇంకా షూటింగ్ కాసేపు ఉంటే బాగుంటుంది అని అనేది అట. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆమె చాలా మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుందట. షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంత సరదాగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ లోని ఈ లక్షణం జాన్వీ కి బాగా నచ్చిందట. రీసెంట్ గానే ఆమె మీద పలు సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ లేదట. ఎన్టీఆర్ లేకపోయేసరికి జాన్వీ కపూర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యిందట. ఆరోజు మొత్తం డల్ గానే కూర్చొని, ప్యాకప్ చెప్పగానే నిరాశతో ముంబై కి తిరిగి వెళ్లిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.