Jailer Movie : ఎప్పటినుంచో రజినీకాంత్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం జైలర్. తమన్నా రజినీకాంత్ కు జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెల్వన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్గా విడుదలైనటువంటి ‘హుకుం…’. అని సాగే రెండవ పాట మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దానితో పాటుగా సాంగ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో రజనీకాంత్ చెప్పిన సంభాషణకు సంబంధించిన వీడియో కూడా చిత్ర టీం విడుదల చేసింది.

ఈ మూవీలో రజినీకాంత్ మంచి మాస్ పవర్ఫుల్ జైలర్ రోల్ లో కనిపించనున్నారు. అయితే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించి లీక్ అయిన స్టోరీ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ విషయం లో నిజం ఎంత ఉంది అన్నది అయితే క్లారిటీ లేదు కానీ…కథ ఇదే అయితే మాత్రం.. స్టోరీ వేరే లెవెల్ లో ఉండడం కన్ఫామ్.
లీక్ ఆయిన సమాచారం ప్రకారం ఈ మూవీలో రజనీకాంత్ ఉన్న జైల్లో ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ కూడా ఉంటాడు. అతని జైలు నుంచి విడిపించడానికి అతని గ్యాంగ్ జైల్ ను బ్రేక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. వాళ్ల దాటికి తట్టుకోలేక మిగిలిన స్టాఫ్ అందరు చేతులెత్తేసినా.. రజనీకాంత్ మాత్రం ఒంటి చేత్తో ఆ గ్యాంగ్ ను ఎలా ఎదుర్కొంటాడు అనే విషయం చుట్టూ స్టోరీ తిరుగుతుంది.
ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నా నెల్సన్ ఇంతకుముందు ఇదే తరహా చిత్రాన్ని విజయ్ తో నిర్మించడం జరిగింది. విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో కూడా ఇదే మాదిరి ఒక షాపింగ్ మాల్ ని అటాచ్ చేసిన తీవ్రవాదుల నుంచి అందులోని అందరినీ అతను సింగిల్ హ్యాండ్ గా కాపాడుతాడు. ఆ మూవీ అంతగా క్లిక్ కానప్పటికీ కాన్సెప్ట్ అయితే అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ మూవీలో రజనీకాంత్ తన స్టైల్ లో సోలో పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో వేచి చూడాలి. ఇందులో మోహన్ లాల్ మరియు శివరాజ్ కుమార్ కూడా ప్రత్యేక క్యామియో రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.