Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు, తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో మెప్పించాడు. ఎప్పుడైతే ఆయన కెరీర్ లో లెజెండ్ సినిమా వచ్చిందో, అప్పటి నుండి ఆయన జాతకమే మారిపోయింది. ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా జగపతి బాబు ఇప్పుడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని సంపాదిస్తున్నాడు.
ఇటీవలే ఆయన ‘సలార్’ ,’గుంటూరు కారం’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ‘సలార్ 2 ‘ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే నేడు జగపతి బాబు పుట్టినరోజు. ఇప్పుడంటే ఆయన విలన్ గా చేస్తున్నాడు కానీ, ఒకప్పుడు ఆయన కూడా పెద్ద స్టార్ హీరోనే కదా, కానీ నేడు ఆయన పుట్టినరోజుని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం బాధాకరం అనే చెప్పాలి.
దీంతో పాపం ఎవరైనా తన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తారేమో అని చాలా ఎదురు చూసినట్టు ఉన్నాడు. ఎవ్వరు చెయ్యకపోయేసరికి ఆయనే ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ వేస్తూ ‘ఎలాగో ఈ భూమి మీద పుట్టేసాను..సిగ్గు వదిలేసి అడుగుతున్నా, నాకు మీ ఆశీస్సులు కావాలి. రెండోది ఆలోచించకుండా చాలా తొందరగా చెప్పండి, ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు’ అంటూ చేతిలో రెండు వైన్ బాటిల్స్ పట్టుకొని అడుగుతాడు.
ఈమధ్య కాలం లో జగపతి బాబు ట్వీట్స్ అన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఈ అకౌంట్ ని ఆయన మైంటైన్ చేస్తున్నాడో, లేదా ఆయన టీం వాళ్ళు మైంటైన్ చేస్తున్నారో తెలియదు కానీ, ఈమధ్య కాలం లో జగపతి బాబు ట్వీట్స్ ఇలాగే ఉంటున్నాయి. ఏది ఏమైనా ఒక పెద్ద నటుడు ఇలా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని స్వయంగా అడగడం కొద్దిగా బాధ కలిగించే విషయమే అని చెప్పొచ్చు.