ఒకప్పుడు శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా అంతటి పేరు తెచ్చుకున్నారు జగపతిబాబు. కుటుంబ నేపథ్యం, ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథలను ఎంచుకుని అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లోనూ నటించాడు. మధ్యలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫ్లాపులు కావడంతో బాలయ్య బాబు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి హీరోగా ఫుల్ స్టాప్ పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. విలన్ పాత్రలకు కేరాఫ్‌గా మారారు. నిజం చెప్పాలంటే జగ్గుభాయ్ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. నిజానికి హీరోగా నటించినప్పుడు వచ్చిన గుర్తింపు కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా జగపతి బాబుకు ఎక్కువ గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటో పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చారు. అందులో షర్ట్ విప్పి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన ఫ్రెండ్స్ తో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికిఫ్రెండ్స్ తో తాగి బట్టు ఊడతీసి తందనాలు ఆడటమ్ అంటే ఇదే
అని కాప్షన్ ఇచ్చాడు.

దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సూపర్ సర్ అని, మరికొందరు ఎంజాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో మీరు మాత్రమే కాదు, మీ మాటలు కూడా బట్టలు విప్పేలా ఉంటాయని జగపతిబాబుకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని తెలుస్తుంది. దాదాపు పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం ఫోటోగా తెలుస్తుంది. ఇక జగపతిబాబు ఇటీవల రుద్రాంగి
చిత్రంలో నటించారు. ఆయన ఇందులో భీమ్‌రావు దేశ్‌ముఖ్ దొర పాత్రలో జీవించారు. పాజిటివ్‌గా, నెగటివ్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో జగ్గుభాయ్ అదరగొట్టేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే నడిపించాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్
లో రాజమన్నార్ పాత్రలో నటిస్తున్నారు. దీంతోపాటు మహేశ్ తో గుంటూరు కారం, అల్లు అర్జున్ పుష్ప2
లో నటిస్తూ బిజీగా ఉన్నారు జగపతిబాబు.
