Jabardasth Varsha : నేనేనా ఇలా చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వర్ష.. దారుణం కదా..

- Advertisement -

Jabardasth Varsha గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో, అందంతో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది. జబర్దస్త్ లోకి రాకముందు పలు సీరియల్స్ లో నటించిన వర్ష ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని అక్కడ స్టార్ పొజిషన్ కి చేరుకుంది. అంతేకాదు ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటున్న లేడీ కమెడియన్ గా కూడా డిమాండ్ తెచ్చుకుంది. ఒకవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

Jabardasth Varsha
Jabardasth Varsha

ఇదిలో ఉండగా గత కొద్ది రోజుల క్రితం వర్ష తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ యూట్యూబ్ ఛానల్ కి సిల్వర్ ప్లే బటన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు జరిగిన యూట్యూబ్ స్వీట్ మెమోరీస్ అన్నింటిని ఆమె మళ్ళీ షేర్ చేస్తూ తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన ఇంటికి వాచ్మెన్ గా ఉంటున్న వ్యక్తి కొడుకులు గురించి చెబుతూ ఆ పిల్లలే తనకు దేవుడు ఇచ్చిన సోదరులు ఫ్రెండ్స్ అంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బును ఆ పిల్లల్లో చిన్న అబ్బాయికి ఖర్చు చేసి తానే చదివిస్తాను అంటూ పెద్ద మనసు చాటుకుంది వర్ష.

Jabardasth Varsha

అంతేకాదు తన జర్నీ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమెకు ధైర్యం చెబుతున్నారు.. ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయాలన్నీ వర్ష తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here