Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష అఫీషియల్ అనే పేరుతో వర్ష 31 డిసెంబర్ 2021 న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.. ఇప్పటివరకు వర్ష యూట్యూబ్ ఛానల్ కి 91,423,605 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. కాగా తన యూట్యూబ్ ఛానల్ కి 301K సబ్స్క్రైబ్ అది కూడా 98 వీడియోలతోనే సాధించడం నిజంగా అరుదైన రికార్డే.. వర్ష యూట్యూబ్ ఛానల్ లో అతి కొద్ది సమయంలోనే అతికొద్ది వీడియోలతో ఇంతమంది ఫ్యాన్ బేస్ ను సంపాదించుకోవడం నిజంగా వండర్ అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్..

తన ఇన్స్టా స్టోరీలో ఈ విషయాన్ని వర్షా పంచుకుంది.. దాంతో ఈ స్టోరీ పై పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆ ఫోటోను వైరల్ చేసే పనిలో పడ్డారు. తన యూట్యూబ్ ఛానల్ లో వర్ష పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రొటీన్ కంటెంట్ తో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయడంతో తన వీడియోస్ ఎక్కువగా వైరల్ అయ్యాయి.
యూట్యూబ్ ఛానల్లో జబర్దస్త్ వర్ష పోస్ట్ చేసిన ప్రతి వీడియో షార్ట్ లక్షల సంఖ్యలో వ్యూస్ వేల సంఖ్యలో లైక్స్ ని సొంతం చేసుకుంది ఇక వన్ మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న వీడియోలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా కూడా వర్షా అధిక మొత్తంలో సంపాదిస్తోంది.. ఏది ఏమైనా కానీ 98 వీడియోలతోనే వర్ష ఇంతమంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు.