Rohini : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది బాగా ఫేమస్ అయ్యారు. వారిలో ఒకరు రోహిణి. లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోహిణి. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈమె కమెడియన్ గా అనేక టీవీ షోలు చేయడంతో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లవ్ స్టోరీని బయట పెట్టింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. ఇంతకీ ఎవరతడు, వారి ప్రేమ ఎలా మొదలైందో తెలుసుకుందాం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోహిణికి చాలా మందే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తన కామెడీ, మాటతీరుతో అందరినీ మెప్పించి.. అనతి కాలంలోనే జబర్దస్త్ షోలో టీమ్ లీడర్ గా మారింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ లో పనిమనిషిగా కనిపించి తెగ నవ్వించేసింది. ఇటీవలే హనుమాన్ సినిమాలోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ హీరోగా వస్తున్న భీమా సినిమాలో నటించింది. హర్ష దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు నటించగా… వెన్నెల కిషోర్, నాజర్, నరేష్, పూర్ణ, రఘుబాబు, చమ్మక్ చంద్ర, నిహారిక వంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటించారు. అలాగే కేకే రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే మార్చి 1న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా టీం.. తాజాగా సుమ అడ్డ అనే ఓ షోకు వచ్చారు.
ఇందులో సుమ ప్రొడ్యూసర్ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉందని అడిగింది. దానికి రోహిణి.. నన్ను కూడా అడగండి అనడంతో.. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని సుమ ప్రశ్నించింది. దీంతో రోహిణి.. ‘‘ నాకు క్రష్ ఉన్నాడు. నాకోసం రాధామోహన్ నా స్కూల్, కాలేజీ రోజుల్లో నా వెంట పడి తిరిగే వాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయనతో కలిసి డ్యాన్స్ స్టెప్స్ కూడా వేసింది. ఇదంతా షోలో భాగంగా రోహిణి కామెడీ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్లో లవ్ ట్రాక్ అనడంతో రోహిణి కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్ మారాయి.