Jordar Sujatha : సినిమాలతో ఫెమస్ అవ్వడం కన్నా కూడా బుల్లి తెరపై ఒకసారి కనిపిస్తే చాలు క్రేజ్ కూడా పెరుగుతుంది అంటున్నారు కొందరు.. అదే విధంగా బుల్లి తెరపై ప్రసారం అవుతున్న పలు షోలు ద్వారా బాగా పాపులర్ అవుతున్నారు.. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడం కోసం ఈ మధ్య బుల్లి తెరపై లవ్ ట్రాక్ లు ఎక్కువ అవుతున్నాయి.. అందులో కొన్ని మాత్రమే జనాలను మెప్పిస్తున్నాయి..ఇక ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో వీటి గురించి ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి షో లో లవ్ ట్రాక్స్ ఎక్కువైపోయాయి..సుడిగాలి సుధీర్ – రష్మీ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ భారీ హిట్ అవ్వడం తో,అదే రకమైన జోడిలను చాలా తయారు చేసింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈ జంటల మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి వీళ్ళ మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉండేవి..
కానీ అవి కేవలం మీకు ఎంటెర్టైమెంట్ పంచడం కోసం, మేము చేస్తున్న స్కిట్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చేవాళ్ళు.. కానీ ఒక జంట మాత్రం కాదు మేము నిజంగానే లవర్స్,పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్న జంట ‘రాకేష్ – సుజాత’. రాకేష్ జబర్దస్త్ షో లో పెద్ద కమెడియన్ అనే విషయం తెలిసిందే. ఇక సుజాత HMTV లో న్యూస్ రీడర్ గా పనిచేస్తూ ఆ తర్వాత స్టార్ మా లో సక్సెపుల్ షో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది జనాలకు సుజాత బాగా దగ్గరైంది..
అయితే బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అవ్వడం తో సుజాత కి స్టార్ మా ఛానల్ లో వెంటనే కామెడీ ప్రోగ్రాం లో చేసే ఛాన్స్ దక్కింది.ఆ షో లో ఈమె స్కిట్స్ బాగా సూపర్ హిట్ అవ్వడం తో రాకేష్ తన టీం లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు రాకేష్ చెప్తూ.. సుజాత పని తీరు నాకు ఎంతగానో నచ్చింది.. ఆమెని నా టీంలోకి తీసుకుంటాను అనగానే మా డైరెక్టర్ వెంటనే ఒప్పుకున్నాడు. అలా మా టీం లోకి వచ్చిన తర్వాత సుజాత ని నన్ను మా డైరెక్టర్ లవ్ పెయిర్ గా చేసేసాడు, దాంతో మా మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది.
ఆ తర్వాత మా ఇద్దరి కాస్త సుఖాలు పంచుకోవడం ప్రారంభించాము, మా ఇంట్లో వాళ్లకి సుజాత బాగా దగ్గరైంది. మాకు తెలియకుండానే మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరం ప్రపోజ్ కూడా చేసుకోలేదు కానీ పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నాం, అలా నా జీవితం లోకి అదృష్ట దేవత లాగ అడుగుపెట్టింది సుజాత. అలా మా డైరెక్టర్ మోసం చేసి మా మధ్య వేయించిన లవ్ ట్రాక్స్ నిజజీవితం లో కూడా పట్టాలెక్కింది అంటూ చెప్పుకొచ్చాడు రాకేష్.. ప్రస్తుతం ఈ జంట గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..