Jabardasth Pavithra : తెలుగు సిని ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకుని తమ బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతున్నారు. వెండితెర బుల్లితెర అనే సంబంధం లేకుండా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న పవిత్ర.. తాను కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్క బోతున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది.

జబర్దస్త్‌తో వచ్చిన ఫేమ్‌ను బాగా ఉపయోగించుకున్న పవిత్ర.. పలు చిత్రాలతో పాటు.. టీవీ షోలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అలాగే తాను ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా పవిత్ర యూట్యూబర్ సంతోష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది. ఇన్నాళ్లకు పెళ్లికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఐదు నెలల క్రితం ఓ ఫ్రాంక్ పెళ్లి వీడియో చిత్రీకరించి యూట్యూబ్ లో విడుదల చేశారు. అది తెగ వైరల్ అయింది. కానీ ఈ సారి మాత్రం నిజంగానే తాను ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

అంతేకాకుండా సంతోష్ తో ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తన పెళ్లి వార్తని ఇలా ప్రకటించడానికి.. ఈ క్షణం కోసం సంతోష్ ఒక ఏడాది నుంచి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారని పవిత్ర తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఇన్ స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేయగా అభిమానుల సైతం ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి తన పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.