Jabardasth Parvitra : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు వారు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. కొందరు దర్శకులుగా కూడా మారారు. ఇక జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి పవిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. త్వరలో పవిత్ర పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. రొమాంటిక్ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
కొద్ది రోజుల క్రితం పవిత్ర సోషల్ మీడియా ద్వారా తన ప్రియుడి గురించి అందరికీ తెలియజేసింది. పవిత్ర సంతోష్‌ని పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించని ఈ జంట ప్రస్తుతం తమ ప్రేమ జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పవిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పవిత్ర తన కాబోయే భర్త సంతోష్‌తో కలిసి వరుణ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘జియా జాలే’కి డ్యాన్స్ చేసింది. కానీ సంతోష్ కి డ్యాన్స్ రాదు, దీనిపై పవిత్ర వివరణ ఇస్తూ.. ‘కొన్ని పరిస్థితుల్లో డ్యాన్స్ రాకపోయేసరికి ఏం చేయాలో తెలుసా… డ్యాన్స్ మేనేజ్ చేయాలి..’ అని రాసింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంతోష్ ముందుగా పవిత్రకు తన ప్రేమను ప్రపోజ్ చేశాడట. కొంతకాలం తర్వాత, పవిత్ర కూడా అంగీకరించింది. ఒక సంవత్సరం ప్రేమలో ఉండి తర్వాత, వారు నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకున్నారు. వైవాహిక జీవితానికి మొదటి అడుగు వేశారు. మరి వీరిద్దరూ ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్నారు. పాగల్ పవిత్రి అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీరిద్దరూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.