Jabardasth Faima : బుల్లి తెర కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పటాస్’ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. జబర్దస్త్ షోలో పలు స్కిట్స్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత పలు షోలతో.. ఈవెంట్లతో తనదైన కామెడీతో చెదరని ముద్ర వేసుకుని నటిగా దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు పలు స్కిట్స్‌లో చెప్పడంతో జనాలంతా నిజమే అని అనుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్ కూడా క్రియేట్ చేశారు. కానీ సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ.. తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేయడంతో విడిపోయామంటూ ప్రకటించారు.

ఫైమా మాత్రం షోలో స్కిట్స్ కోసమే అలా చేశానంటూ చెప్పి షాకిచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న నెటిజన్లు వారు మళ్లీ కలుస్తారని ఆశించారు. ఈ క్రమంలో ఫైమా తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసి షాకిచ్చింది. అయినా ఇది నిజమేనని ఎవరూ నమ్మలేదు. కానీ ఇటీవల ఆమె బర్త్ డే జరుపుకుని తమ రిలేషన్ కన్ఫమ్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ప్రేమికుడు ప్రవీణ్ నాయక్‌తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫొటోలను అతను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘‘ నా ప్రియమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ప్రేమ మొదలై ఐదేళ్లు పూర్తి అయింది.
ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. అదే పోస్ట్‌ను ఫైమా కూడా పెట్టి రిలేషన్‌షిప్‌ను కన్ఫమ్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్ కావడంతో వాటిని చూసిన వారంతా అయోమయంలో పడ్డారు. అలాగే ఐదేళ్లు ఇతనితో ప్రేమలో ఉంటే జబర్దస్త్ ప్రవీణ్ ను ప్రేమిస్తున్నట్లు జనాలను ఎందుకు మోసం చేశావంటూ ఫైర్ అవుతున్నారు. బాగా ఫేమస్ అయ్యాక ప్రవీణ్ ను వదిలేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే కొందరు డీజే టిల్లు రాధిక నేహా శెట్టి అయితే బుల్లితెర రాధికవి నువ్వంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram