Jabardasth Comedy Show : మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బుల్లితెర మీద సుమారుగా పదేళ్ళ నుండి నాన్ స్టాప్ గా ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ షోస్ లో సరికొత్త ట్రెండ్ ని నెలకొల్పిన కామెడీ షో గా దీనిని మనం చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ హిట్ అన్నమాట. ప్రతీ శుక్రవారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ని కూడా ప్రారంభించారు.

ప్రతీ గురువారం ప్రసంసరమయ్యే ఈ షో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ పాపులర్ కామెడీ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చలాకి చంటి, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ ఇలా ఒక్కరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది.
వీళ్లంతా ప్రస్తుతం టాలీవుడ్ ఏ స్థాయి కమెడియన్స్ గా కొనసాగుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా ఎంతో మందికి జీవితం ని అందించిన ఈ కామెడీ షో అతి త్వరలోనే ఆగిపోనుందని సమాచారం. ఈ షో కి బదులుగా మరో కొత్త షో ని ప్లాన్ చేస్తున్నారట. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో రికార్డులు నెలకొల్పిన ఈ కామెడీ షో, ప్రస్తుతం అతి తక్కువ రేటింగ్స్ తో కొనసాగుతుంది అట.

వస్తున్న రేటింగ్స్ కి ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి ఉండడం తో, ఈ కామెడీ షో కి త్వరలోనే శుభం కార్డు పడబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే తెలియచేయనున్నారు. ఈ షో ప్లేస్ లో మరో కామెడీ షో ప్లానింగ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు ఆడియన్స్.