Mukku Avinash : బిడ్డను పోగొట్టుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్.. ఎమోషనల్ పోస్ట్

- Advertisement -


Mukku Avinash : జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్. చక్కటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ రియాల్టి షోలో స్థానం దక్కించుకున్నాడు. హౌస్ నుంచి బయటకు రాగానే పలు టీవీ షోలు, సినిమాల్లో ఛాన్సులతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక ముక్కు అవినాష్ అనూజ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పంచుకున్న ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకునే వాడు. గతేడాది ఏప్రిల్ నెలలో తన భార్య ప్రెగ్నెంట్ అన్న వార్త సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇటీవలే తన భార్య అనూజకు అట్టహాసంగా సీమంతం వేడుక నిర్వహించారు. త్వరలో తమ ఇంటికి పండండి బిడ్డ రాబోతున్నట్లు ఆనందంగా తెలిపాడు.

ఈలోగా విధి వెక్కిరించింది. ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా అవినాష్ పంచుకున్నారు. ఆ పోస్టు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్టు చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆయన బిడ్డ పుట్టకుండానే తల్లి కడుపులోనే కన్ను మూసింది. బాధను దిగమింగలేకపోతున్నానంటూ అవినాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయామని, అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడించాడు. “నా జీవితంలో సంతోషమైనా, బాధ అయినా, నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ, మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూసాం. కానీ, కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాన్నీ పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్” అని రాసుకొచ్చాడు. ఇక అవినాష్ బిడ్డ చనిపోయాడని తెలియడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.

https://www.instagram.com/p/C1xXGLDhgjr/

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here