Dhanraj : జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి మంచి లైఫ్ ఇచ్చింది. ఆ షోలో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లు ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. వారిలో ఒకరు ధనాధన్ ధన్ రాజ్. తన దైన శైలిలో కామెడీ పంచులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు ధనరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి బాగానే సంపాదించుకున్నాడు. కానీ ధనరాజ్ తన సినీ కెరియర్లో సంపాదించిందంతా బాహుబలి సినిమా వల్ల పోగొట్టుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ధనరాజ్ కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని చిత్రాలు చేశారు. దాంతో పాటు ఆయన హీరోగా చేస్తూ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’.. ఈ సినిమాలో ధనరాజ్ తో పాటు శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడంతో రాజస్థాన్ కి వెళ్లాం.. ఆ సమయంలో తన సినిమా విడుదల అయ్యింది.. అప్పటికే మంచి హిట్ టాక్ తో తన సినిమా నడుస్తోంది. కానీ ఆ తర్వాత వారమే బాహుబలి సినిమా విడుదల అయింది. మొదటి వారంలోనే తమ చిత్రాన్ని చూడటానికి ఎవరూ రాలేదని చెప్పాడు ధన్ రాజ్.
బాహుబలి సినిమా విడుదలయ్యాక కూడా థియేటర్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని తీసేశారని దీంతో తమ సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయని తెలిపాడు. దీంతో తాను సంపాదించిన డబ్బులతో పాటు తన స్నేహితుల దగ్గర నుంచి అప్పుగా తీసుకొని మరి ఈ సినిమా చేస్తే అంతా నష్టపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఈ డబ్బులు ఏదైనా భూమి మీద పెట్టుబడి పెట్టింటే మంచి లాభాలు ఉండేవనీ సూచించిదట..కానీ తన భార్య మాట వినకుండా సినిమా చేసి చాలా తప్పు చేశానని ధన్ రాజ్ పశ్చాత్తాపడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.