Viswaksen: ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో విశ్వక్ కంటే మాస్ హీరో ఎవరు లేరేమో…

- Advertisement -

Viswaksen: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోస్ లలో విశ్వక్ సేన్ కు ఉన్నంత సక్సెస్ రేట్ ఎవ్వరికి లేదు. అలాగే రోత మూవీలతో కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తూనే, కమర్షియల్ సక్సెస్ ను కూడా అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన గామి మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. చాలా డిఫరెంట్ కంటెంట్ అండ్ విసువల్ తో తెలుగు ప్రేక్షకులకు విశ్వక్ కొత్త రకమైన ట్రీట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరితో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి, ట్రేండింగ్ లో ఉన్నాయ్.

“సుట్టంలా సూసి పోకలా” అనే సాంగ్స్ మూవీ ఎప్పుడో రిలీజ్ చేసింది.అయితే ఇప్పుడు మరో సాంగ్ ను విడుదల చెయ్యడానికి మూవీ యూనిట్ సిద్ధమైంది. మోత మోగిపోద్ది అనే సాంగ్ సాంగ్ ప్రోమోను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో విశ్వక్ లుంగీ కట్టుకుని ఫుల్ మాస్ లుక్ లో ఉన్నాడు. ఆ సాంగ్ లో విశ్వక్ తోపాటు ఆయేషా ఖాన్ కూడా ఉన్నారు. ఈ మూవీ విశ్వక్ కెరీర్ కంప్లీట్ మాస్ మూవీ. ఈ మాస్ లుక్ కూడా విశ్వక్ కు చాలా బాగా సెట్ అయ్యింది.

ఇప్పుడన్నా యంగ్ హీరోస్ లో మాస్ లుక్ ను ఇంత ఈజ్ తో పుల్ చేస్తుంది మాత్రం విశ్వక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా పర్ఫెక్ట్ గా ఆ మాస్ లుక్ విశ్వక్ సెట్ అయ్యాడు. ఈ గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీ మే 17న విడుదల కానుంది. సాంగ్స్ హిట్ కావడంతో ఈ మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా గామీ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్నే విశ్వక్ ఇమేజ్ తో హిట్ అయ్యింది. అందుకే ఈ మాస్ కంటెంట్ తో విశ్వక్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here