Konidela Upasana : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. మరి ముఖ్యంగా డబ్బున్న స్టార్ సెలబ్రిటీస్ పిల్లల గురించి.. వారింటి కోడలు గురించి ఎలాంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునే మెగా కోడలు ఉపాసన ఇప్పుడు సోషల్ మీడియాలో మొదటి సారిగా నెగిటివ్ ట్రోలింగ్ కి గురవుతుంది. ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.
రామ్ చరణ్ సతీమణీగానే కాకుండా.. వివిధ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇక అది అలా ఉంటే ఉపాసన తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.మహిళలు వారి అవసరాలకు అనుగుణంగా మెటర్నిటీ లీవ్స్ తీసుకునే అవకాశం కంపెనీలు కల్పించాలనీ చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఆడవాళ్లు వారి ఎగ్స్‌ను కాపాడుకోవాలని ఉపాసన అన్నారు. అంతేకాదు వాటిని ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలని ఆమె సూచనలు చేశారు.

ఇది ఇలా ఉంటే ఉపాసన చాలా మంచి అమ్మాయి మంచి హ్యూమన్ బీయింగ్ ..అవసరం లో ఉన్న వాళ్లకి కచ్చితంగా సహాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవారి పట్ల అన్ని విషయాలలో కలగజేసుకుంటూ అండగా ఉంటుంది. అయితే ఉపాసనలో తెలియని మరో కోణం కూడా ఉందని .. ఆమె ఫుడ్ విషయంలో బాగా కోపిష్టి అని.. తనకి ఇష్టమైన వాళ్ల ఫుడ్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. మరీ మరీ తన భర్త రామ్ చరణ్ విషయంలో అయితే 100శాతం స్ట్రిక్ట్ గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో ఉపాసన గురించి రాంచరణ్ సైతం ఇదేవిధంగా కామెంట్లు చేశాడు. దీంతో ఉపాసన మహా జాదుదే అంటూ నాటీగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఉపాసన పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు రెండో బిడ్డను కనడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
