Vennela Kishore : మన టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవే లేదు. కానీ ఒకప్పుడు ఉన్న కమెడియన్స్ మాత్రం ఇప్పుడు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాస్య బ్రహ్మ గా పిలవబడే బ్రహ్మానందం కూడా సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేసాడు. సునీల్ కూడా కామెడీ రోల్స్ కి దూరమై, ముఖ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ఇక వేణు మాధవ్ అయితే దురదృష్టం కొద్దీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.
అలాగే బ్రహ్మానందం తో సరిసమానమైన ఇమేజి ఉన్న ఏంఎస్ నారాయణ కూడా స్వర్గస్తులయ్యారు. ఇలా ఇండస్ట్రీ కి సంబంధించిన కమెడియన్స్ మొత్తం దూరం అవ్వడం తో ఒక స్పేస్ ఏర్పడింది. ఆ స్పేస్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని అతి తక్కువ సమయం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు వెన్నెల కిషోర్. వెన్నెల సినిమా పరిచయమైన ఈయన ఆ తర్వాత తన డిఫరెంట్ స్టైల్ కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయాడు.
అంతే కాకుండా వెన్నెల కిషోర్ కి స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందరితో ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. కానీ ఎందుకో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎక్కువ హాజరు కాదు. దీనికి కారణం ఏమిటో రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్.
ఆయన మాట్లాడుతూ ‘నాకు చిన్న తనం నుండి స్టేజి ఫియర్ ఉంది. జనాలను చూడగానే నాలో భయం మొదలు అవ్వుధి. అంతే కాకుండా ఒకరు నన్ను పొగుడుతుంటే ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాదు. ఒక్క చిన్న థాంక్స్ తో సరిపెట్టలేను. ఊరికే ఒకసారి పొగిడితే మ్యానేజ్ చెయ్యొచ్చు, కానీ అదేపనిగా పొగుడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి దూరం గా ఉంటూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్.